మా క్షమాపణలు.. చలపతిని క్షమించండి

సీనియర్‌ నటుడు చలపతి రావు ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ సినిమా ఆడియో వేడుకలో ఆడవారు పక్కలోకి పనికి వస్తారు అంటూ చేసిన వాఖ్యలపై దుమారం రేగుతున్న నేపథ్యంలో మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయంపై స్పందించింది. మా అధ్యక్షుడు, సభ్యులు చలపతి రావు వ్యాఖ్యలను క్షమార్హం కావు అంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎవ్వరు చేసినా కూడా తప్పుపట్టాల్సిందే అన్నారు.

మా సభ్యుడు ఆడవారిపై చేసిన వ్యాఖ్యలకు మా తరపున క్షమాపణలు చెబుతున్నామని, అలాగే ఆయన్ను కూడా ఈసారికి క్షమించాలని మా సభ్యులు అన్నారు. మరోసారి మా సభ్యులు ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వారిని మా నుండి తొలగింస్తామని హెచ్చరించారు. సినిమా పరిశ్రమకు చెందిన వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అని చెప్పుకొచ్చారు.

చలపతి రావుపై మహిళ సంఘాల వారు పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని, ఆయన వ్యాఖ్యలను కొట్టిపారేస్తునే ఆయనకు క్షమాభిక్ష పెట్టాలంటూ మహిళ సంఘాల వారిని మా వేడుకొంది. అయితే మా సభ్యుల విజ్ఞప్తిని మాత్రం మహిళ సంఘాల నేతలు పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రస్తుతం మహిళ సంఘాలు చలపతి రావుపై నిర్భయ యాక్ట్‌ కింద కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నారు.

To Top

Send this to a friend