ప్లీజ్ అడ్డుకోవద్దు.. 


బాహుబలి 2 సినిమా విడుదల దగ్గరపడుతున్న కొద్దీ వేడి పెరుగుతోంది. అంతటా సవ్యంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా కన్నడలో మాత్రం అవాంతరాలు ఎదురవుతున్నాయి. బాహుబలి2లోని పాత్రధారి కట్టప్ప సత్యరాజ్ వ్యాఖ్యల నేపథ్యంలో అక్కడ రిలీజ్ కాకుండా అడ్డుకుంటామన్న కన్నడ సంఘాలకు బాహుబలి దర్శకుడు రాజమౌళి ఈరోజు ట్విట్టర్ లో ఒక వీడియోను విడుదల చేసి సినిమాను అడ్డుకోవద్దంటూ కన్నడలో మాట్లాడి వారికి విజ్ఞప్తి చేశాడు.

రాజమౌళి కన్నడ రాకపోవడం.. నాకు సరిగ్గా కన్నడ రాదని.. క్షమించాలంటూ రాజమౌళి మొదలుపెట్టారు. మొత్తం ప్రసంగాన్ని కన్నడలో మాట్లాడి అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. తమిళనటుడు సత్యరాజ్ బాహుబలి లో నటించిన వందల మందిలో ఒకడని.. ఆయన ఒక్కడి వల్ల వందల మంది కష్టాన్ని ఇలా అడ్డుకోవద్దని రాజమౌళి విజ్ఞప్తి చేశారు. సత్యరాజ్ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అది అని.. వాటితో బాహుబలి యూనిట్ కు ఎలాంటి సంబంధం లేదని రాజమౌళి వివరణ ఇచ్చారు. రిలీజ్ అడ్డుకుంటే అందరూ నష్టపోవాల్సి వస్తుందని.. బాహుబలి తొలి భాగాన్ని ఆదరించినట్టుగానే కన్నడ ప్రేక్షకులు రెండో భాగం విడుదలను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.

బాహుబలి 1 కన్నడలో దాదాపు 40 కోట్లు వసూలు చేసింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బాహుబలి2 సినిమా కన్నడలో అనుకున్న స్థాయిలో రిలీజ్ కాకపోతే కలెక్షన్ల మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. దీంతో కన్నడ ప్రజలకు రాజమౌళియే స్వయంగా రిలీజ్ అడ్డుకోవద్దంటూ విజ్ఞప్తి చేశారు. ట్విట్టర్ లో కింది వీడియోను పోస్టు చేశారు.

To Top

Send this to a friend