దేశం కోసం ఆడితే ఇంతే అబ్బా..

 

అనిల్ కుంబ్లే నిబద్ధత, నైపుణ్యం గురించి ఎవ్వరికీ సందేహాలు లేవు. అతడు దేశం కోసం ఆడాడు. దేశం కోసమే బతికాడు. క్రికెట్ నే ప్రాణంగా భావించి పాటు పడ్డాడు. ఇండియా ఓడిపోతున్నప్పుడు తన తలకు గాయం అయినా లెక్కచేయకుండా బ్యాండేజ్ కట్టుకొని బౌలింగ్ కు దిగాడు. ఇండియా టీమ్ ను గెలిపించాడు. కానీ ఇప్పుడు ఆ దేశభక్తుడు వైదొలిగాడు. ఈ కార్పొరేట్ క్రికెట్ కు తన దేశభక్తి పనికిరాదని భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి రాజీనామా చేశాడు.

అనిల్ కుంబ్లే భారత క్రికెట్ కోచ్ పదవి నుంచి వైదొలడం దేశవ్యాప్తంగా దుమారం రేగింది. కుంబ్లే, భారత క్రికెటర్ల దూకుడు కల్లెం వేసాడు. జట్టు కోసం పాటు పడ్డాడు. అంతటి గొప్ప క్రికెటర్ కుంబ్లేను కోచ్ పదవి నుంచి తీసేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ఏది ఏమైనా ఓ దిగ్గజ క్రికెటర్ పట్ల భారత క్రికెటర్లు, బీసీసీఐ వ్యవహరించిన తీరే ఏమీ బాగోలేదు. కార్పొరేట్ ముసుగులో కోట్లకు పడగలెత్తిన క్రికెటర్లకు కుంబ్లే కఠినంగా ఉండడం నచ్చలేదు. ఆయనకు పొగబెట్టి వెళ్లగొట్టారు. భారత క్రికెట్ కు మేలు చేసే నిర్ణయాలు తీసుకున్న కుంబ్లే కు జరిగిన ఈ అవమానానికి భారత క్రికెట్ కెప్టెన్ కోహ్లీ సహా క్రికెటర్లంతా సమాధానం చెప్పాల్సిందేనని నెటిజన్లు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.

To Top

Send this to a friend