పిల్లల్ని చంపేసే గేమ్..


‘బ్లూ వేల్  చాలెంజ్’ ఇప్పుడు ఈ గేమ్ 18 ఏళ్లలోపు పిల్లల ప్రాణాలు తీస్తోంది. వింత వింత టాస్క్ లు ఇస్తూ చివరకు ఆత్మహత్యకు పురిగొల్పేలా గేమ్ ఉంటుందట.. ఈ గేమ్ గనుక ఆడితే పిల్లలు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నిస్తారు. అమెరికా, బ్రిటన్ లో ఇలాగే ఈ గేమ్ ఆడిన వారు సూసైడ్ చేసుకోవడంతో ఈ విషయం వెలుగుచూసింది.

ఈ గేమ్ మొదలుపెట్టగానే అకౌంట్ క్రియేట్ చేయాలి.. ఆ తర్వాత 50 రోజుల పాటు ప్రతీ రోజు  గేమ్ లో పనులు చేయిస్తారు. దాన్ని చేశామో లేదో స్క్రీన్ షాట్ తీసి గేమ్ లో అప్ లోడ్ చేయాలి. ఇలా విపరీతమైన పనులు కల్పిస్తూ మానసికంగా పిల్లలను ఇబ్బందిపెడుతుంది. అలాగే హర్రర్ సినిమా చూడమని.. రాత్రిళ్లు లేచి చిన్న టాస్క్ లు చేయమని గేమ్ లో పురమాయిస్తారు. అంతేకాదు.. మిమ్మల్ని మీరే గాయపరుచుకోవాలని గేమ్ లో ఉంటుందట..

ఈ గేమ్ లు రష్యాలో కూడా పలువురి చిన్నారుల మరణాలకు కారణమయ్యాయట.. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఈ గేమ్ సృష్టించిన వ్యక్తిని అరెస్ట్ చేశారట.. మీ పిల్లలను ఇలాంటి గేమ్ ల బారినపడకుండా తల్లిదండ్రులు ఇప్పటికైనా జాగ్రత్త వహించండి..

To Top

Send this to a friend