అతిగా ఆశపడి ఆహుతైపోయారు..


‘అతిగా ఆశపడే ఆడది.. అతిగా ఆవేశపడే మగాడు సుఖపడ్డట్టు చరిత్రలేదు’ ఇది రజినీకాంత్ చెప్పిన ఫేమస్ డైలాగ్.. కానీ ఇండియాలోనైనా.. పక్కనున్న పాకిస్తాన్ వంటి దేశాల్లోనైనా ఫ్రీ వస్తుందంటే జనం ఎగబడతారు.. ఆ ఫ్రీగా వచ్చే పెట్రోల్ కోసం అర్రులు చాచి ఒకటి కాదు రెండు కాదు 200 ప్రాణాలు మాడిమసి అయిపోయాయి..

పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రం బాహావల్ పూర్ జిల్లాలో జాతీయ రహదారిపై ఓ చమురు ట్యాంకర్ పడిపోయింది. టైర్ పేలడంతో ట్యాంకర్ అదుపు తప్పి పడిపోయింది. ఈ ఘటనలో పెట్రోల్ రోడ్డుపై ఏరులుగా పారింది. రోడ్డుపై పారుతున్న పెట్రోల్ ను పట్టుకునేందుకు స్థానిక గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పెట్రోల్ ను బైకులు, సీసాలు, క్యాన్లలో నింపుకుంటున్నారు. ఇంతలోనే ఒక వ్యక్తి సిగరెట్ అంటుపెట్టుకోవడం అగ్గిపుల్లకు పెట్రోల్ అంటుకోవడం జరిగిపోయాయి. ట్యాంకర్ కు అగ్గి అంటుకొని పేలిపోయింది. దీంతో దానికి 100 మీటర్ల దూరం వరకు మంటలు ఎగిసిపడి దాదాపు 150మంది అక్కడికక్కడే చనిపోగా.. మిగతా చాలా మంది ఆస్పత్రిలో చనిపోయారు. ఇప్పటికే మృతుల సంఖ్య 200 దాటింది. ఇంకా చాలా మంది పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. మృతుల్లో పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు..

పెట్రోల్ ట్యాంకర్ పడిపోయిందని ఊళ్లల్లో సమాచారం ఇవ్వగానే తండోపతండాలుగా జనం ఎగబడి పోయారు. వారి అత్యాశే.. వారికి చేటు తెచ్చింది. పేదవాడి అత్యాశే చివరకు చావును మోసుకొచ్చిందని గాయపడ్డ బాధితుడు ఒకరు బోరుమన్నాడు.

పాకిస్తాన్ లో ట్యాంకర్ బోల్తా పేలకముందు, పేలిన తర్వాత దృశ్యాలను కింద వీడియోలో చూడొచ్చు..

 

 

 

To Top

Send this to a friend