పెన్ డ్రైవ్ కొంటున్నారా.. జాగ్రత్త

ఫ్లిప్ కార్ట్, అమేజాన్ తో పాటు బయట చవకగా దొరికే నాన్ బ్రాండెడ్ పెన్ డ్రైవ్ లు కొనేటప్పుడు జాగ్రత్త పాటించాలి. ఎందుకంటే కొంత మంది హ్యాకర్లు తక్కువకు పెన్ డ్రైవ్ లను తయారు చేసి అందులో కొన్ని సాఫ్ట్ వేర్ లను పొందుపరుస్తున్నారు. అది మన పీసీ, ల్యాప్ ట్యాప్, ఫోన్ కు కనెక్ట్ చేయగానే సదురు హ్యాకర్లకు విషయం తెలిసిపోతుంది. వెంటనే వారు మన కంప్యూటర్ లోని కీలక సమాచారం.. బ్యాంకుల అకౌంట్లు, పాస్ వర్డ్ లను తస్కరిస్తారు. తద్వారా మన డబ్బులు, ఇతర విలువైనవి పోగొట్టుకునే అవకాశాలుంటాయి. కాబట్టి బయట ఎప్పుడు బ్రాండెడ్ వస్తువలనే కొనండి..
మార్కెట్లో ప్రధానంగా సోని, సాన్ డిస్క్ వంటి కంపెనీ పెన్ డ్రైవ్ లను వినియోగదారులు కొనాలి. అందులో 8జీబీలో కొంతమేర పోయిన 7.8 జీబీ పైనే అందుబాటులో ఉంటుంది. కానీ ఈ చవక పెన్ డ్రైవర్ లలో 8 జీబీకి 7 జీబీనే లభిస్తుంది. మిగతా జీబీ అంతా హ్యాకర్లు మన సమాచారం దొంగిలించడానికి అందులో నిక్షిప్తం చేసిన సాఫ్ట్ వేర్లకు పోతుంది. సో ఇక నైనా మార్కెట్లోకి వెళ్లినప్పుడు మంచి బ్రాండ్ పెన్ డ్రైవ్ లనే అందరూ కొనండి.
To Top

Send this to a friend