‘పెళ్లిచూపులు’ కు అవార్డు అందుకే..


దక్షిణ భారత ఐఫా అవార్డుల్లో చోటు దక్కలేదు. ఇతర టీవీలు, పలు సంస్థలు ఇచ్చే అవార్డుల్లోనూ పెళ్లిచూపులు సినిమాకు ఒక్క అవార్డు రాలేదు. కానీ భారత ప్రభుత్వం ఇచ్చే జాతీయ అవార్డుల్లో తెలంగాణ భాషకు, యాసకు పట్టం కట్టారు. పెళ్లి చూపులు సినిమా అచ్చ తెలంగాణ భాషతో తీసిన సినిమా.. భారీ డైలాగులు, ట్రాజెడీలు ఉండవు.. తొడగొట్టడాలు అస్సలే ఉండవు.. పాటలు.., ఫైట్లు లేవు. అయినా ఈ తెలుగు సినిమా సాధించింది. జాతీయ అవార్డును కొల్లగొట్టింది. ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది.

పెళ్లి చూపులు సినిమా పెద్దగా కథేం లేదు. వాస్తవ సంఘటనలు సినిమాటిక్ గా కామెడీని జతచేసి మన ఇంట్లో ఎలా జరుగుతుందో దాన్నే చూపించారు. సాధారణ హీరోహీరోయిన్లను తీసుకొని యువత మనోభావాలకు పట్టం కట్టేలా చిత్రాన్ని తీశారు. ఇంట్లో మాట్లాడే భాషనే సినిమాలోనూ వాడారు. అందుకే ప్రేక్షకులు ఆదరించారు. పెద్ద హిట్ చేశారు. డబ్బులు వచ్చాయి. ఇప్పుడు జాతీయ పురస్కారంతో పెళ్లిచూపులు సినిమాకు గౌరవం వచ్చింది. స్థానిక అవార్డులు ఏవీ రాకున్నా జాతీయ పురస్కారం దక్కడమే పెళ్లి చూపులు టీంకు కొండంత బలం..

To Top

Send this to a friend