పవన్-రాజమౌళి కలిస్తే రికార్డు బద్దలే..


కాటమరాయుడు రిలీజ్ అయిన కొత్తలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ సినిమాపై నెగిటివ్ కామెంట్లు చేశాడు. కానీ కాటమరాయుడు హిట్ కావడం.. రికార్డు కలెక్షన్ల దిశగా దూసుకుపోతుండడంతో వర్మ తన రూటును మార్చాడు. అంతేకాదు నిన్న జరిగిన బాహుబలి2 ప్రీ రిలీజ్ ఆడియో ఫంక్షన్ చూశాక వర్మ మదిలో మరో ఆలోచన వచ్చింది.. దాన్ని ట్విట్టర్ లో ఇలా రాసుకొచ్చారు..

‘పవన్ కళ్యాణ్, రాజమౌళి కలిసి ఓ సినిమా కోసం పనిచేస్తే అది బాక్సాఫీసును బద్దలుకొట్టి కొత్త రికార్డును క్రియేట్ చేస్తుంది. ఓ అభిమానిగా ఈ కలయికలో సినిమా రావాలని కోరుకుంటున్నానని’ ట్వీట్ చేశాడు. పవన్ విషయంలో వర్మ పాజిటివ్ గా స్పందించడంపై నెటిజన్లు కూడా రియాక్ట్ ఈ కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ అవుతుందని తెగ కామెంట్లు పెడుతున్నారు.
వర్మ ట్విట్టర్ కామెంట్లు కింద చూడొచ్చు..

To Top

Send this to a friend