పవన్ పార్టీ షురూ చేసింది..


పవన్ కళ్యాన్ పొలిటికల్ కార్యక్రమాలు షురూ చేశాడు. తాను పోటీచేయాలనుకుంటున్న అనంతపురం జిల్లానుంచే జన సేన పార్టీ కార్యక్రమాలు మొదలయ్యాయి. అందుకోసం సర్వం సిద్దం చేస్తున్నాడు. ముందుగా జనసేన పార్టీ కార్యాలయాన్ని అనంతపురంలో ప్రారంభించేందుకు పవన్ రెడీ అయ్యాడు. ఇప్పటికే ఇక్కడ కార్యాలయాల వేట మొదలైందట.. ఇక వాటి సిబ్బంది కోసం జనసేన పార్టీ వెబ్ సైట్ లో దరఖాస్తులు అందుబాటులో ఉంచింది..

వ్యాఖ్యత, రైటింగ్ స్కిల్స్ ఉన్నవారిని కంటెంట్ రైటర్స్ గా విశ్లేషణ పరిజ్ఞానం కలిగిన వాళ్లని అనలిస్టుగా కొనసాగిస్తామని.. అందుకోసం వెబ్ సైట్ లో దరఖాస్తులను ఉంచింది.

మొదటగా అనంతపురం నుంచి దరఖాస్తులను జనసేన పార్టీ కోరింది. తర్వాత మిగతా ఏపీ జిల్లాల్లోనూ దీన్ని చేపట్టనున్నారు. ఆసక్తి ఉన్నవాళ్లు తమ పేరును నమోదు చేసుకొని దేనికి ప్రాధాన్యం ఇస్తున్నారో తెలియజేయాలని సూచించింది. ఇందుకోసం http://www.janasenaparty.org/resourcepersons/లో దరఖాస్తును ఆన్ లైన్ లో నింపితే పార్టీ చూసి మీకు కబురు చేస్తుంది. ఈనెల 28నుంచి ఏప్రిల్ 4 వరకు పేర్లను రిజిస్ట్రర్ చేసుకోవచ్చు. అనంతపురం జిల్లా వాసులైతే శ్రీ బాలాజీ రెసిడెన్సీ, 11/129, వినాయక్ చౌక్, సుభాష్ రోడ్, సప్తగిరి సర్కిల్, అనంతపురం అడ్రస్ లో సంప్రదించవచ్చని పార్టీ కోరింది.

To Top

Send this to a friend