పవన్-మహేశ్ ఫ్యాన్స్ ఫైట్:


ఇద్దరూ అగ్రహీరోలే.. మహేశ్ అంటే పవన్ కు గౌరవం.. పవన్ అంటే మహేశ్ కు గౌరవం.. వీరిద్దరికి మంచి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరికీ కామన్ మిత్రుడైన త్రివిక్రమ్ వీరిద్దరిపై ఎప్పుడు అభిమానం చూపుతాడు.. పవన్ పై అభిమానంతోనే మహేశ్ బాబు.. జల్సా సినిమాకు వాయిస్ ఓవర్ అందించి ఆ సినిమాకు ప్లస్ అయ్యాడు. కానీ మహేశ్-పవన్ ల మధ్య ఉన్న సాన్నిహిత్యం ఆయన అభిమానుల్లో లేకపోవడం గమనార్హం. అగ్రహీరోల ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న సోషల్ వార్ తో ఇప్పుడు తెలుగునాట పవన్, మహేశ్ లతో పాటు వాళ్లను అభిమానించే నటులు, దర్శకులు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు..

సర్దార్ గబ్బర్ సింగ్ నుంచి మహేశ్-పవన్ ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలై పరాజయం పాలైన తర్వాత మహేశ్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పవన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలు పెట్టారు. పవన్ ను విమర్శించారు. ఆ తర్వాతి నెలలోనే మహేశ్ బాబు.. ‘బ్రహ్మోత్సవం’ విడుదలైందిం. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఊరుకుంటారా..? పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోయి మహేశ్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు.

సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ ప్రచారం.. ఇప్పుడు కాటమరాయుడుపై పడింది. మహేశ్ ఫ్యాన్స్ కాటమరాయుడిపై విష ప్రచారం చేస్తున్నారు. దీంతో టిట్ ఫర్ ట్యాట్ లాగా వీరిద్దరి వైరం.. తెలుగు నాట అభిమానులు.. వారిని అభిమానించే వ్యక్తులకు మనస్తాపాన్ని కలిగిస్తోంది.. ఇప్పటికైనా మహేశ్, పవన్ ఫ్యాన్స్ ఇలా దుమ్మెత్తిపోసుకొని ఇద్దరి హీరోల పరువు తీయవద్దని అందరూ కోరుతున్నారు.

To Top

Send this to a friend