చచ్చినా పర్లేదు.. అన్యాయాన్ని సంహించ: పవన్

‘ప్రజాసమస్యలే నా ధ్యేయం.. జనసేన లక్ష్యం అధికారం కాదు.. ప్రజాశ్రేయస్సే ముఖ్యం.. నాకు రాజకీయాల్లోకి వచ్చాక ఎన్నో బెదిరింపులు వచ్చాయి. చంపేస్తామన్నారు. అయినా అన్యాయాన్ని , ఆక్రందనలను ఎదుర్కొనే విషయంలో చచ్చినా పర్లేదు’ అంటూ ఉద్వేగంగా ప్రసంగించారు పవన్ కళ్యాన్..  అమెరికా పర్యటనలో ఉన్న పవన్.. న్యూహాంప్ షైర్ లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనసేన అంటే పీపుల్స్ ఆర్మీ అని.. ధైర్యే సాహసే లక్ష్మీ ఇదే మా నినాదమన్నారు. ఏపీ ప్రత్యేక హోదాకోసం ప్రాణం పోయేదాకా పోరాడుతానన్నారు. ఇచ్చిన మాట తప్పితే తనకు నచ్చదని.. మాట తప్పిన వారిపై (టీడీపీ, బీజేపీ)పై పోరాడుతానన్నారు.

భారత సంస్కృతి గొప్పది..

అమెరికా, భారత సంస్కృతికి చాలా తేడా ఉందని జనసేనాని పవన్ చెప్పారు. తాను 9 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు స్కూలు వెళ్లకపోయేవాడినన్నారు. కానీ మా అమ్మ చెప్పిన మాటలు.. ఆమె నేర్పిన విద్య.. సంస్కృతి సంప్రదాయాలను నాలో చాలా మార్పులు తీసుకువచ్చాయన్నారు. పిల్లలపై ప్రేమ, మానవ సంబంధాలు, సంస్కృతి , సంప్రదాయాల విషయంలో భారత్ నుంచి ప్రపంచమంతా నేర్చుకోవాలని అన్నారు.

సినిమాల కన్నా ప్రజాసమస్యలే ఇష్టం..

అన్యాయాన్ని చూస్తు ఊరుకోను. తిరగబడతా ప్రజాసమస్యలపై పోరాడుతానన్నారు పవన్. తనకు సినిమాల కన్నా ప్రజాసమస్యలపై పోరాటమే సంతృప్తినిస్తుందన్నారు. తనకు కుల రాజకీయాలు నచ్చవని.. ఎవరైనా తనను ఒక్క కులానికి పరిమితంచేస్తే.. మన కూలపోడివి అంటే నచ్చదన్నారు. సినిమాలను కేవలం బతకడానికే చేస్తున్నానని.. తనకు ప్రజలకు సేవచేయడమే ఇష్టమన్నారు. అందుకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. కానీ అధికారం కోసం కాదన్నారు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు అవసరాల మేరకు మారుతారన్నారు. కానీ ఆ వైఖరి తనకు నచ్చదన్నారు. ఎవ్వరూ ఆపదలో ఉన్నా తాను వారి తరఫున పోరాడుతానన్నారు.  సమస్యను సరిగ్గా అర్థం చేసుకోనప్పుడే అది ఉద్యమంగా మారుతుందన్నారు. తెలంగాణ ఉద్యమం అలానే పుట్టిందన్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా కూడా అలానే పుడుతోందన్నారు.

సిద్ధాంతాల కోసం అన్నయ్య, కుటుంబానికే దూరంగా..

ప్రజారాజ్యం పార్టీ స్తాపించినప్పుడు అన్నయ్య చిరంజీవి వెంట నడిచానని కానీ  తర్వాత కాంగ్రెస్ లో కలిసినప్పుడు తాను అన్నయ్య, కుటుంబంతో విభేదించి ప్రజల కోసం ఫ్యామిలీకే దూరమయ్యానన్నారు. తనకు కుటుంబం, భార్య, పిల్లల కన్నా ప్రజాసమస్యలే మిన్న అన్నారు.

పవనిజం.. హ్యూమనిజం..

నేనే చేస్తున్న పనులు చూసి అందరూ పవనిజం అని పేరు పెట్టారని.. దానికి నా అభిమానులు, ప్రజలకు కృతజ్ఞతలన్నారు. కానీ తన పవనిజంలో హ్యూమనిజం ఉందన్నారు. బాధితులకు అండగా నిలిచేదే పవనిజం అన్నారు.  ఎవ్వరైనా కష్టాల్లో ఉంటే వారి తరఫున పోరాడడమే పవనిజం సిద్దాంతమన్నారు.

కులాల కుంపంట్లు నచ్చవు..

ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో కులాల కుంపట్లు అస్థిరపరుస్తున్నాయని.. తమిళలు, మహారాష్ట్రులు, ఆంధ్ర, తెలంగాణ మిగతా రాష్ట్రాల్లో కులాల కోసం కొట్టుకుంటన్నారు. ఒక్క సామాజికవర్గ నేతలే శాసిస్తున్నారని.. మిగతా వారిని అణిచివేస్తున్నారన్నారు. ఇది తనను కలిచివేస్తోందన్నారు. రెడ్డి, కమ్మ, కాపు అంటూ ప్రజల మధ్య విద్వేశాలు రెచ్చగొడుతున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తన పిల్లలు తల్లితోపాటు క్రిస్టియన్ మతం స్వీకరించినా తాను అభ్యంతరం పెట్టలేదని.. మత స్వేచ్ఛ అందరికీ అవసరమన్నారు.

మొత్తంగా రాజకీయాలు, సామాజికవర్గ విభేధాలు, కులాల కుంపట్లు, ఏపీ, తెలంగాణ వర్తమాన పరిస్తితులు, జనసేన లక్ష్యాలు , వచ్చే ఎన్నికల్లో క్రియాశీల వైఖరి తదితర వాటిపై తన అంతరంగాన్ని అమెరికా వేదికగా అక్కడి ప్రజలతో పంచుకున్నారు. వేదికపై పవన్ తో పాటు పవన్ స్నేహితుడు  , నిర్మాత శరత్ మరార్ కూడా దర్శనమిచ్చారు.

పవన్ ప్రసంగం పూర్తి వీడియోను కింద లింక్ లో చూడొచ్చు..

To Top

Send this to a friend