పవన్.. చలించిపోయాడు..

ప్రమాదాల్లో వైకల్యం పొందిన వారు, వికలాంగులు జనసేన కోసం పనిచేస్తామని ముందుకురావడంపై పవన్ కళ్యాణ్ చలించిపోయారు. ఒక పార్టీ కోసం ఇంతగా తపిస్తున్న వారికోసం ఏం చేయడానికైనా సిద్ధమని ప్రకటించారు. ఏపీ, తెలంగాణల్లో వక్తలు, విశ్లేషకులు, కంటెంట్ రచయితల్ని ఎంపిక చేసే ప్రక్రియపై హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో పవన్ పాల్గొని ఉద్వేగంగా మాట్లాడారు.

రాజకీయ లబ్ధితో తాను జనసేన పార్టీకి రిక్రూట్ మెంట్ చేయడం లేదని పవన్ స్పష్టం చేశారు. అన్ని పార్టీల మాదిరిగా జనసేన కాదని.. దీనికి ప్రజాసమస్యలే ప్రథమ కర్తవ్యమన్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ‘కామనెమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్’ ఏర్పాటు చేసి ప్రజాసమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని ప్రయత్నాలు చేసినా ఆ పార్టీ అంతర్థానంతో ఆగిపోయిందన్నారు. ఆ ఫోర్స్ ను తానే నడిపిద్దామని అనుకున్నానని.. కానీ సాధ్యం కాలేదని.. కానీ ఇప్పుడు జనసేన ద్వారా మళ్లీ మొదలు పెడతామని పవన్ స్పష్టం చేశారు.

పవన్ రిక్రూట్ మెంట్ అన్ని జిల్లాల్లో దసరాలోపు పూర్తి చేసి దసరా తర్వాత ప్రజల్లోకి వెళ్లడానికి కసరత్తు చేస్తున్నారు. 2019ఎన్నికలే టార్గెట్ గా ఏపీలో ప్రజలతో మమేకమై జనసేనను నిలబెట్టాలని యోచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం పవన్ త్రివిక్రమ్ మూవీ తర్వాత ఏ సినిమాను ఒప్పుకోకపోవడం గమనార్హం.

To Top

Send this to a friend