సినిమాలకు పవన్ గుడ్ బై..

దసరా నుంచి సినిమాలకు ఫుల్ స్టాప్ పెడుతున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం తుదిదశకు చేరుకుంది. షూటింగ్ ను త్రివిక్రమ్ శరవేగంగా చేస్తున్నట్టు తెలిసింది. ఆ సినిమా ఈ నెలలోనే కంప్లీట్ అవుతుందట.. దసరాకు విడుదల కానుంది. అయితే గ్యాప్ లో పవన్ మరో సినిమాకు ఓకే చెప్పాడు.

 

 

నూతన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ చెప్పిన కథ నచ్చడంతో దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించబోతోంది. దసరాలోపే సినిమాను పూర్తి చేయాలని పవన్ కండీషన్ పెట్టినట్టు సమాచారం. అందుకోసం కేవలం రెండు నెలల కాల్షీట్లు మాత్రమే పవన్ ఇచ్చారని తెలిసింది. ఈ 60 రోజుల కాల్షీట్లకు పవన్ కు నిర్మాతలు 40 కోట్ల పారితోషికం ఇస్తున్నట్టు తెలిసింది. ఆలోపే ఎలాగైనా సినిమాను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

 

 

దసరా నుంచి ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ క్రియాశీలకంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ సినిమానే చివరిదని అనుకున్నారు. కానీ ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ సినిమా పూర్తి కావడం.. రెండు నెలల సమయం ఉండడంతో పవన్ మరో సినిమాను అంగీకరించారు. మైత్రీ మూవీ మేకర్స్ 40 కోట్ల పారితోషికాన్ని రెండు నెలలకు ఇస్తామని చెప్పడంతో పవన్ అంగీకరించినట్టు తెలిసింది. ఈ మొత్తాన్ని ఎన్నికల్లో ఖర్చు కోసం వెచ్చించనున్నట్టు తెలిసింది.

To Top

Send this to a friend