కత్తి మహేశ్ పై పవన్ కళ్యాణ్ స్పందన

కత్తి మహేశ్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. నిన్న బీటెక్ విద్యార్థులు ఆయనను కలిసినప్పుడు విలేకరులు వేసిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మీడియాలో వైరల్ గా మారిన మహేశ్ కత్తి ఉదంతంపై సూటిగా మాట్లాడారు. పబ్లిసిటీ కోసం కొందరు చేసే కామెంట్లపై తాను స్పందించనన్నారు. పవన్ కళ్యాణ్ ను తిట్టడం ద్వారా కొందరు పాపులర్ కావాలనుకుంటారని.. వారిపై స్పందించి తాను తన స్థాయిని దిగజార్చుకోదల్చుకోనని స్పష్టం చేశారు. ఇక తన అభిమానులను కూడా అలాంటి వారిని టార్గెట్ చేయడం మాని ప్రజా ఉపయోగ పనులు చేయాలని సూచించాడు. ఇలా పవన్ కళ్యాణ్ మహేశ్ కత్తి విమర్శలకు జవాబు ఇవ్వకుండా సంయమనంతో వ్యహరించడం గమనార్హం.

కత్తి మహేష్.. సినీ విశ్లేషకుడు, విమర్శకుడు. ఇటీవలే బిగ్ బాస్ షోకి వెళ్లి వచ్చి పాపులర్ అయ్యాడు. తాజాగా ఓ టీవీ ఛానల్ లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ప్రశ్నిస్తేనే సీఎం కాలేడంటూ కాస్త సూటిగానే అంటించాడు. ఇక పవన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? భగ్గున లేస్తున్నారు. ఆయన ఫోన్ నంబర్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి కత్తి మహేష్ సంగతి చూడమంటూ బహిరంగంగానే పిలుపునిచ్చారు. గతంలో అనేక ఘటనల్లో పవన్ పై విమర్శలు చేసిన వారిపై విరుచుకుపడడం చూశాం.. ఇప్పుడు తాజాగా కత్తి మహేష్ పై పవన్ కళ్యాణ్ నేరుగా స్పందించడంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది.

To Top

Send this to a friend