2019లో జనసేన పోటీ ఖాయం..

జనసేనాని భారీ స్కెచ్ తోనే అమెరికా వెళ్లారు. అక్కడ దిగ్గజ వ్యూహకర్తలు, రాజకీయ మేధావులతో పవన్ భేటి వెనుక ఏముంది..? పవన్ తో రెండు గంటల పాటు అమెరికాన్ రాజకీయ వ్యూహకర్త జార్జింగ్ ఏకాంతంగా జరిపిన చర్చల్లో ఏపీలో2019 ఎన్నికలే ప్రధానాంశంగా ఎందుకయ్యాయి. అసలు జనసేనాని అడుగులు ఎటు పడబోతున్నాయి.? వీటన్నింటి ప్రశ్నల వెనుక ఒకటే ఉంది.. అదే 2019 ఎన్నికల్లో పవన్ ఎంట్రీ.. అవును.. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో  పవన్ పోటీ చేయడం ఖాయం గా కనిపిస్తోంది… అందులో భాగంగానే పవన్ అమెరికాలో దిగ్గజ రాజకీయ వ్యూహాకర్త జార్జింగ్ తో సమావేశమయ్యారని తెలిసింది. 2019 ఎన్నికల్లో ఎలాంటి ఎత్తుగడలు అవలంభించాలి.. అభ్యర్థుల ఎంపిక ఎలా..? లాంటి కీలక విషయాలను పవన్ జార్జింగ్ తో చర్చించారట. దీంతో రాజకీయాల్లో పోటీకి పవన్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని దీన్ని బట్టి అర్థమవుతోంది….

పవన్ అమెరికా టూర్ వెనుక భారీ వ్యూహామే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ, కేంద్రంలో ఉన్న బీజేపీలు ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మోసం చేశాయి. వారితో అంటకాగిన పవన్ సైతం ఈ విషయంలో ఏం చేయలేకపోతున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగి ఏపీ ప్రత్యేక హోదాను సాధించడం… ప్రజల కష్టాలు తీర్చడమే ధ్యేయంగా  పవన్ ముందడుగు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ ప్రత్యేక హోదాకోసం పోరాడుతున్న వైసీపీ అధినేతతో కలిసి పవన్ పోటీచేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పోటీ మాత్రం ఖాయమేనని స్పష్టమవుతోంది. అందుకే అమెరికాలోనే ఫేమస్ రాజకీయ వ్యూహకర్తలతో పవన్ వరుస భేటిలు అవుతున్నరనే ప్రచారం జరుగుతోంది. జనసేనాని రాజకీయ ఎంట్రీ.. ఎన్నికల్లో ఎలా పోటీచేయాలి..? అభ్యర్థుల ఎంపిక తదితర వాటన్నింటిపై పవన్ అమెరికాలో వ్యూహకర్తలతో చర్చిస్తున్నట్టు తెలిసింది.

To Top

Send this to a friend