పవన్ కళ్యాన్ ఇక సినిమాలకు వీడ్కోలు పలకనున్నాడా.?

తన జీవనానికి, పేదలకు సాయం చేయడానికే సినిమాలు చేస్తున్నానని ప్రకటించిన పవన్ కళ్యాన్ ఇక సినిమాలకు వీడ్కోలు పలకనున్నాడా.? త్రివిక్రమ్ తో చేసే సినిమానే పవన్ ఆఖరు సినిమా .? ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్లో వినిపిస్తున్న మాటలను బట్టి త్రివిక్రమ్ సినిమానే లాస్ట్ అనే మాట వినిపిస్తోంది. సినిమా తరువాత పవన్ ఫుల్ టైం రాజకీయాల్లోకి రావడానికి రంగం సిద్దం చేసుకున్నారనే వార్త వినిపిస్తోంది.

 

సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాల ప్లాప్ తో పవన్ కు ఆర్థికంగా లాభాలు రాలేదు. దీంతో త్రివిక్రమ్ తో చేసే సినిమాతోనైనా కొన్ని డబ్బులు వస్తే రాజకీయాల్లోకి వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని పవన్ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. అందుకే ఈ సినిమాను ఖచ్చితంగా హిట్ చేసేలా చూడాలని త్రివిక్రమ్ ను కోరాడట…. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ ల నుంచి వస్తున్న మూడో చిత్రం ఇదీ..

జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడానికి సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నాడనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అందుకే త్రివిక్రమ్ సినిమాను చాలా ఫాస్ట్ గా పూర్తి చేస్తున్నాడని తెలిసింది. త్రివిక్రమ్ సినిమా తరువాత పవన్ ఒప్పుకున్న సినిమాలన్నింటిని 2019 వరకు వాయిదా వేసుకున్నాడని తెలిసింది. సినిమాలను పక్కనపెట్టి 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పవన్ ఫుల్ టైం పాలిటిక్స్ లోకి రావడానికి స్కెచ్ గీసినట్టు సమాచారం.

To Top

Send this to a friend