బాబుతో భేటి.. పవన్ నమ్ముతారా.?

ఓవైపు విమర్శలు.. మరో వైపు పరామర్శలు, భేటీలు.. రాజకీయంగా పవన్ తప్పటడుగులు కొనసాగుతూనే ఉన్నాయి.. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీ-టీడీపీ కూటమితో తెగతెంపులు చేసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ ప్రభుత్వంపై కొద్దిరోజులుగా తీవ్ర విమర్శలు చేస్తూ ఏపీలోని సమస్యలను లేవనెత్తుతున్నారు. అంతేకాదు.. వచ్చే 2014 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి చంద్రబాబుపైనే పోటీచేసేందుకు సిద్ధమయ్యారు.. అందుకోసం జనసేన పార్టీ సొంతం కార్యకర్తలు నాయకుల కోసం రిక్రూట్ మెంట్లు జిల్లాల వారీగా నిర్వహిస్తోంది. ఇక నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష వైసీపీకి లోపాయికారి ఒప్పందంగా మద్దుతు ఇస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి..

ఇలా టీడీపీకి దూరం జరిగినట్టే కనిపించిన పవన్ .. ఈరోజు మళ్లీ చంద్రబాబుతో భేటికి అపాయింట్ మెంట్ కోరడం వివాదాస్పదమైంది. పైకి ఇది ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై విదేశీ వైద్యబృందం పర్యటన కోసం మీటింగ్ అని చెబుతున్నా.. అంతర్గతం నంద్యాల ఉప ఎన్నిక, జగన్ పాదయాత్రకు శ్రీకారం చుట్టడం.. రాజకీయంగా టీడీపీకి గడ్డు పరిస్థితిపై చంద్రబాబు .. పవన్ తో భేటిలో చర్చిస్తారని సమాచారం. ఇలా చంద్రబాబుపై బయట విమర్శలు చేస్తూ ఇప్పుడు ఆయన్ను సేవ్ చేసే పనిలో భేటిలు జరుపుతున్న పవన్ వైఖరి రాజకీయంగా విమర్శలకు దారితీస్తోంది..

పవన్ .. తప్పటడుగులు ఆయన పార్టీ జనసేనకు, ప్రజల్లో ఆయనపై ఉన్న ఇమేజ్ కు డ్యామేజ్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. ప్రస్తుతం ఏపీలో అధికార టీడీపీపై ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతోంది. ప్రత్యేక హోదా సహా చాలా హామీలు అమలు చేయని బాబు ప్రభుత్వం పై స్వయంగా పవనే విమర్శలు గుప్పించారు. ఇప్పుడు మళ్లీ ఆయన తిట్టిన చంద్రబాబునే కలిసేందుకు పూనుకున్నారు. ఈ భేటి పవన్ కు రాజకీయంగా నష్టం చేకూరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

To Top

Send this to a friend