పవన్‌తో తిట్లు తిన్న ఆ కమెడియన్‌ ఎవరు?

పవన్‌ కళ్యాణ్‌ ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ షూటింగ్‌ సమయంలో షకలక శంకర్‌పై సీరియస్‌ అయ్యాడు అనే ప్రచారం జరిగింది. పదే పదే కుళ్లు జోకులు వేయడంతో పాటు ఏదో కారణం వల్ల విసిగి పోయిన పవన్‌ కళ్యాణ్‌ కమెడియన్‌ శంకర్‌పై కాస్త సీరియస్‌ అయ్యారు. ఆ తర్వాత అంతా సెట్‌ అయ్యింది. ఆ సంఘటన గురించి కొన్ని నెలల పాటు ప్రచారం జరిగింది. మళ్లీ ఇప్పుడు మరో వివాదంతో పవన్‌ సోషల్‌ మీడియా ముందుకు వచ్చాడు.

ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ సినిమా షూటింగ్‌లో ఉండగా ఒక కమెడియన్‌ పదేపదే పవన్‌ కళ్యాణ్‌ను ఇరిటేట్‌ చేస్తున్నాడట. దాంతో కోపం వచ్చిన పవన్‌ కళ్యాణ్‌కు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చాడు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. దాంతో ఆ కమెడియన్‌ ఎవరు అంటూ అందరిలో కూడా చర్చ జరుగుతుంది.

ఆ కమెడియన్‌ ఎవరు అనే విషయంపై చిత్ర యూనిట్‌ సభ్యులు అనధికారికంగా స్పందిస్తూ ప్రవీణ్‌నే పవన్‌ కళ్యాణ్‌ విసిగించాడు అంటూ చెప్పుకొస్తున్నారు. ‘అఆ’ చిత్రంలో నితిన్‌తో నటించి మంచి కామెడీ చేసిన ప్రవీణ్‌ మళ్లీ ఈ సినిమాలో కూడా త్రివిక్రమ్‌ దయతో మంచి పాత్రను దక్కించుకున్నాడు. ఈ సమయంలోనే పవన్‌ కళ్యాణ్‌తో ప్రవీణ్‌ పదే పదే రాజకీయాల గురించి మాట్లాడేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడట. పార్టీ గురించి అడుగుతూ ఉన్నాడట. దాంతో పవన్‌కు కోపం వచ్చి ప్రవీణ్‌పై సీరియస్‌ అయినట్లుగా తెలుస్తోంది.

To Top

Send this to a friend