మహేశ్ కత్తిని చంపేస్తామంటున్న పవన్ అభిమానులు..

పవన్ రాజకీయ, సినీ జీవితంపై ఇటీవల పలు విమర్శలు చేసిన మహేశ్ కత్తిని ఆయన అభిమానులు టార్గెట్ చేసి ఆడుకుంటున్న సంగతి తెలిసిందే.. పవన్ అభిమానులను తీవ్రవాదులని మహేశ్ కత్తి తాజాగా విమర్శించారు. తాను ఎంతవరకైనా వెళతానని.. తెలుగు హీరోల్లో మహేశ్ బాబు మంచి నటుడు అని.. అసలు పవన్…. మహేశ్ ముందు దిగదుడుపేనని మరోసారి వ్యాఖ్యానించి మహేశ్ కత్తి దుమారం రేపాడు.

మూడు రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో పొరపాటున బుద్ధి గడ్డి తిని ఏదో వాగిన పాపానికి బిగ్ బాస్ సెలబ్రెటీ మహేశ్ కత్తి అష్టకష్టాలు పడుతున్నాడు. అతడికి 10 సెకన్లకు ఒక ఫోన్ కాల్.. సెకన్ కు ఒక వాట్సాప్ మెసేజ్, ఇక రోజుకు 10వేల వరకు ఎస్.ఎం.ఎస్ లు, ఈమెయిల్స్ వస్తున్నాయట..

ఇలా పవన్ అభిమానులు మహేశ్ కత్తిని టార్గెట్ చేసి బండబూతులు తిడుతూ చంపేస్తామంటూ బెదిరిస్తుండడంతో ఆయన కుదేలయ్యాడు. మరోసారి మీడియా ముందుకు వచ్చి పవన్ అభిమానులు తనకు చేసిన బెదిరింపు కాల్స్, మెసేజ్ లను చూపించి వాపోయాడు.. ఇలా వరుస వివాదాలు, వ్యాఖ్యలతో మహేశ్ కత్తి వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

To Top

Send this to a friend