రాజమౌళి, పవన్ కలిసి సినిమా..

ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి పెరిగింది. రాజమౌళి… తీసిన బాహుబలితో టాలీవుడ్ ని ఎక్కడికో తీసుకెళ్లారు. రాజమౌళి అంటేనే ఓ బ్రాండ్. అలాంటి రాజమౌళి, తెలుగులో స్టార్ హీరో అయిన పవన్ తో కళ్యాణ్ తో సినిమా చేస్తే.. చేస్తే సంచలనమే.. అదే ప్రశ్న రాజమౌళికి ఎదురైంది.. దానికి ఆయనేం చెప్పారో తెలుసా…

‘పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయాలని ఉంది కానీ ఆయనిప్పుడు బిజీగా ఉన్నారు. రాజకీయాలవైపు మళ్లారు. ప్రస్తుతం పవన్ చేయబోయే రెండు సినిమాలు పూర్తయి, ఎన్నికలు పూర్తవ్వాలంటే 2019 కావాల్సిందే.. అప్పుడు పరిస్థితులెలా ఉంటాయో చెప్పలేం..’ అంటూ పవన్ సినిమా గురించి రాజమౌళి స్పష్టం చేశారు. పవన్ తో సినిమాలు చేయాలని ఉన్నా పవన్ బిజీ షెడ్యూల్ , తన వద్ద సరైన కథలేకపోవడమే కారణమని రాజమౌళి వెల్లడించారు.

ఇటీవల వరుసగా టీవీషోలల్లో పాల్గొంటున్న రాజమౌళి రానా నిర్వహిస్తున్న నంబర్ 1 యారీ ప్రోగ్రాంలో ఇటీవల పాల్గొన్నాడు. ఈ షోలో పవన్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు రానా ప్రశ్నించాడు.. ‘పవన్ తో సినిమా ఉంటుందా అని’ దానికి చూచాయగా సమాధానమిచ్చాడు పవన్ కళ్యాన్..

To Top

Send this to a friend