నితిన్.. ఏంటి ఇలా చేశావ్..?

అఆ సినిమాతో హిట్ కొట్టిన నితిన్ ఢిఫెన్స్ లో పడ్డారు. రోటీన్ ప్రేమకథా స్టోరీలకు కాస్త పుల్ స్టాప్ పెట్టాడు. ఖచ్చితంగా హిట్ కొట్టే కథనే ఎంచుకోవాలని చాలా కాలంలో కథల్ని రిజక్ట్ చేస్తున్నాడట.. ఈ మధ్యే నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది.. అదే రాఘవపూడి చెప్పిన కథ నితిన్ కు నచ్చడం.. అదీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండడం విశేషం. ఇందులో అర్జున్ విలన్ గా నటిస్తున్నారు. ముప్పాతిక శాతం అమెరికా లో షూటింగ్ జరుపుకుంటోందట.. అమెరికా అంటే భారీ ఖర్చు.. 14 రీల్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం నితిన్ కు భారీ బడ్జెట్ చిత్రం. అంత భారీ బడ్జెట్ చిత్రంలో నటించడం నితిన్ కు ఇదే తొలిసారి.. యంగ్ హీరో నితిన్ ను బెట్టి భారీ బడ్జెట్ తో సినిమా తీశారు నిర్మాతలు.. మరి అలాంటి సాహసం చేసిన తీసిన లై సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

నితిన్ నటించిన తాజా చిత్రం లై సినిమాను చూసిన పవన్ కళ్యాన్ నితిన్ పై ప్రశంసలు కురిపించాడు. పవన్ మాట్లాడుతూ.. ‘తాను నితిన్ సినిమాలు చాలా చూశాను. ఇంత కొత్త లుక్ లో నితిన్ అద్భుతంగా ఉన్నాడని కితాబిచ్చాడు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరి నటన చాలా బుగుందన్నారు. అర్జున్ గారు కూడా చాలా ఏళ్ల తర్వాత నటించినప్పటికీ తన స్టామినా ఏమాత్రం తగ్గకుండా చేశారు. హీరోయిన్ కూడా హీరో నితిన్ కు పోటీగా నటించింది.

ముఖ్యంగా సినిమాల్లోని కొన్ని సన్నివేశాలు అయితే ఊహించలేనంత ట్విస్ట్ ను నింపాయి. ఈ సినిమా ఘనవిజయం సాధించి బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటానని అన్నారు. అంతేకాదు నితిన్ కు ఫోన్ చేసి మరీ అభినందనలు తెలిపాడట.. ఈ విషయాన్ని నితిన్ చాలా ఉద్వేగంగా తెలిపారు. ఇక ఈ వార్త రావడంతో నితిన్, పవన్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

To Top

Send this to a friend