పవన్.. ఇది బాలయ్య, ఎన్టీఆర్ 15ఏళ్ల కిందే చేశారు..


పవన్ కళ్యాన్ ను అప్పుడే పొగడడం.. మళ్లీ అప్పుడే తిట్టడం వర్మకు అలవాటైపోయింది. రాజమౌళి పవన్ తో చేస్తే ఇండస్ట్రీ హిట్ అని అప్పుడే అంటాడు.. ఆ తర్వాత మళ్లీ కాటమరాయుడు సినిమాలోని లూప్ హోల్స్ ను వెతుకుతాడు.. పిచ్చిపట్టినట్టు రాతలు రాసేస్తాడు. కాటమరాయుడు గ్రాండ్ హిట్ అంటాడు. ఆ తర్వాత అందులో ఇది బాగా లేదంటే ఏకంగా ఆ సీనునే ట్విట్టర్లో పెట్టి కాపీ కొట్టాడని విమర్శిస్తారు..

ట్విట్టర్ వేదికగా రాంగోపాల్ వర్మ చేష్టలపై నెటిజన్లు మండిపడుతున్నారు. పవన్ కళ్యాన్ నటించిన కాటమరాయుడులో కార్లు పైకి లేచే సీన్ ను ఫొటో తీసి ట్విట్టర్ లో పెట్టాడు వర్మ. దానికి గాను ఇలా రాసుకొచ్చాడు..

‘పవన్ కళ్యాణ్ కాటమరాయుడు మూవీలో కార్లను పైకి లేపే సీన్ ను పెట్టాడు. కానీ దీన్ని ఎన్టీఆర్ ఆది సినిమాలో.. బాలయ్య చెన్నకేశవరెడ్డి సినిమాలో దాదాపు 15ఏళ్ల కింద చేశారు. కొత్తగా చేయి పవన్ అంటూ’ ట్విట్టర్ లో సెటైర్ వేశాడు.

To Top

Send this to a friend