పత్తిపాటిxజగన్: ఎవరిపై బహిష్కరణ?


‘అగ్రిగోల్డ్ భూములు కొన్నట్టు నిరూపితమైతే జ్యూడిషియల్ విచారణకు సిద్ధం.. తప్పని తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. లేదంటే జగన్  తప్పుకుంటారా.? ఒప్పైతే అసెంబ్లీనుంచే బహిష్కరిస్తాం..’అంటూ మంత్రి పత్తిపాటి పుల్లారావు అసెంబ్లీలో జగన్ కు సవాల్ విసరడం.. దానికి చంద్రబాబు కూడా పుల్లారావు భూముల కొనుగోలుపై జ్యూడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించడం జరిగిపోయింది..

అంతకుముందు అసెంబ్లీలో జగన్ మండిపడ్డారు. ‘మంత్రి పత్తిపాటి పుల్లారావు.. రాజధాని ప్రాంతంలో అగ్రిగోల్డ్ నుంచి అక్రమంగా భూములు తక్కువకు కొని రైతులను మోసం చేశారని.. మధ్యలో అగ్రిగోల్డ్ ను వాడుకున్నారని’ జగన్ ఆరోపించారు. దీనిపై వెంటనే విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు..

కాగా ఈ సవాలును స్వీకరించిన పత్తిపాటి.. జగన్ కు ప్రతిసవాలు విసరడం..విచారణకు సిద్దం కావడం.. తప్పని నిరూపిస్తే జగన్ ను అసెంబ్లీ నుంచి బహిష్కరిస్తాం.. రెడీనా అని జగన్ ను ప్రశ్నించడం జరిగిపోయాయి. ఈ వివాదంలో అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం చర్చనీయాంశమైంది.

To Top

Send this to a friend