చిత్రం : పటేల్ సర్
రేటింగ్ : 2.0/5.0
బ్యానర్ : వారాహి చన చిత్రం
సంగీతం : డిజే వసంత్
దర్శకుడు : వాసు పరిమి
నిర్మాత : సాయి కొర్రపాటి
విడుదల : జులై 14, 2017
స్టారింగ్ : జగపతిబాబు, పద్మ ప్రియ, తన్య హోప్, పోసాని, సుబ్బరాజు, శుభలేక సుధాకర్, కబీర్ దుహన్ సింగ్ తదితరులు.
ఎన్నో ఫ్యామిలీ చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించిన జగపతిబాబు గత కొంత కాలంగా సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. మరోసారి హీరోగా ఒక ప్రయత్నం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను చేశాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథలోకి వెళితే : పటేల్ సర్(జగపతిబాబు) ఆర్మీలో మేజర్‌గా చేసి రిటైర్డ్ అవుతాడు. తన కొడుకు కూడా ఆర్మీ ఆఫీసర్ కావాలని ఆయన కోరుకుంటాడు. కాని కొడుకు మాత్రం డాక్టర్ అవ్వాలనే కోరికతో ఉంటాడు. దాంతో తండ్రి కొడుకుల మద్య విభేదాలు. ఆ విభేదాలతో తండ్రి కొడుకులు విడిపోతారు. తండ్రి నుండి విడిపోయిన కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత తన తల్లి ఆరోగ్యం బాగాలేదని తెలుసుకుని భార్య, పిల్లతో ఇంటికి వస్తాడు. ఆ సమయంలో ఒక షాకింగ్ సంగటన జరుగుతుంది. ఆ సంఘటనతో పటేల్ సర్ జీవితం మరో మలుపు తీసుకుంటుంది. ఆ మలుపు ఏంటి? ఆ షాకింగ్ సంఘటన ఏంటి అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల ఫర్ఫార్మెన్స్ : జగపతిబాబు అద్బుత నటనతో ఆకట్టుకున్నాడు. పటేల్ సర్ లుక్ అదిరిపోయింది. చాలా స్టైలిష్‌గా జగపతిబాబు కనిపించాడు. గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈ చిత్రంలో జగపతిబాబును చూడవచ్చు. రెండు విభిన్న పాత్రల్లో నటించిన జగ్గూబాయ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇక హీరోయిన్ పద్మప్రియ ఆకట్టుకుంది. ఈమె పాత్ర నిడివి తక్కువగా ఉంది. ఉన్నంతలో పర్వాలేదు అనిపించింది. ఒక పోలీస్‌గా తన్య హోస్ పర్వాలేదు అనిపించింది. మిగిలిన వారి గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు.
సాంకేతికపరంగా: పాటల గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మామూలుగానే ఉంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. జగపతిబాబును మరింత స్టైలిష్‌గా చూపించడంలో సినిమాటోగ్రఫీ ఉపయోగం చాలా ఉంది. ఎడిటింగ్‌లో లోపాలున్నాయి. దర్శకుడు కాస్త స్క్రీన్‌ప్లేపై దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో సీన్స్ అంత ఆసక్తికరంగా సాగలేదు. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.
విశ్లేషణ: మంచి కథలు ఎంచుకుని నిర్మించడంలో సాయి కొర్రపాటి ముందు ఉంటాడు. ఈయన వెనుక రాజమౌళి ఉండటం కూడా ఈయనకు కలిసి వచ్చే అంశం. ఈ సినిమాకు కూడా రాజమౌళి మద్దతు ఉంది. సినిమా పబ్లిసిటీకి రాజమౌళి మాటలు పనికి వచ్చాయి. అయితే సినిమా మాత్రం సాదారణ ప్రేక్షకుల అభిరుచికి ఆమడ దూరంలో ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సాదారణ తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఆధరించడం కష్టమే. ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా పర్వాలేదు అన్నట్లుగా ఉందని అంటారు.
ప్లస్ పాయింట్స్ :
జగపతిబాబు,
కాన్సెప్ట్,
కొన్ని స్టైలిష్ సీన్స్
నచ్చనివి :
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం,
ఎడిటింగ్, సాంగ్స్,
ఎంటర్టైన్మెంట్ లేకపోవడం.
చివరగా :
‘పటేల్ సర్’ బోర్ కొట్టించాడు.
