పండుగొచ్చిందోచ్..


భారత ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కస్టమర్ల కోసం భారీ పండుగను తీసుకొస్తోంది. మే 11న ‘గ్రేట్ ఇండియన్ సేల్’ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. నాలుగు రోజుల పాటు డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్టు ప్రకటనలో తెలిపింది. భారత కస్టమర్లను ఆకట్టుకోవాలని అమెజాన్ ప్రముఖ బ్రాండ్స్ అన్నింటిపైనా గ్రేట్ డీల్స్ ను ఆఫర్ చేస్తోంది.

అయితే అమేజాన్ కంటే ముందే ఫ్లిప్ కార్ట్ మే 2 నుంచే ‘సమ్మర్ షాపింగ్ డేస్ సేల్’ పేరిట సేల్ ను నిర్వహించింది. దీనికి పోటీగా అమేజన్ మే 11 నుంచి సేల్ ను ప్రకటించింది. కొన్నేళ్లు భారత మార్కెట్ పై భారీగా పెట్టుబడులు పెడుతున్న అమేజాన్ ఎన్నో లక్షల ఉత్పత్తులను తక్కువ ధరకు అందిస్తూ దేశీయ మార్కెట్ లో నంబర్ 1 ర్యాంకు కోసం పోటీ పడుతోంది. కానీ అమేజాన్ కు ప్లిప్ కార్ట్ గట్టి పోటీనిస్తోంది.

గత అక్టోబర్ లో నిర్వహించిన దీపావళి సేల్ ఫ్లిప్ కార్ట్ అమ్మకాలను చేరుకోలేకపోయిన అమేజాన్ ఈ సారి అంతకుమించి ఆఫర్లను ప్రకటించింది. ఈసారి మే 11 న నిర్వహించే ఓపెన్ సేల్ తో ఫ్లిప్ కార్ట్ రికార్డు అమ్మకాలను అధిగమించి మొదటిస్థానం సంపాదించాలని గొప్ప గొప్ప చీప్ ఆఫర్లను ప్రకటించింది. కేవలం డిస్కౌంట్లు కాకుండా, ఇటు వివిధ బ్యాంకుల కార్డులపై క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. వెబ్ సైట్ ద్వారా 10శాతం, యాప్ ద్వారా కొనుగోలు చేస్తే 15 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తున్నట్టు ఆమేజన్ పేర్కొంది. దీంతో వినియోగదారులు ఈ వారమంతా పండుగ చేసుకోవాల్సిందే..

To Top

Send this to a friend