పాకిస్తాన్ కు షాక్.. మోది పయనం..

ప్రధాని నరేంద్ర మోది ఇజ్రాయెల్ లో జరుపుతున్న పర్యటన, రెండు దేశాల మధ్య సంబంధాలని బలోపేతం చేసే దిశగా ఒక కీలక ముందడుగు. మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడే ఇజ్రాయెల్ దేశం కూడా పుట్టింది. చుట్టూతా శత్రువులు ఉన్నా, నిరంతరం పాలస్తీనాతో ఘర్షణలు ఉన్నా.. కనీసం సరైన వ్యవసాయ భూమి లేకపోయినా..పట్టుదలతో, కసితో, కాస్త అమెరికా సాయంతో ఇజ్రాయెల్ ఒక బలమైన దేశంగా ఎదిగింది. దేశ రక్షణ, వ్యవసాయం ఈ రెండు రంగాలలో టెక్నాలజీ పరంగా ఇజ్రాయెల్ మనకన్నా చాలా ముందు ఉంది. ఇజ్రాయెల్ తో సంబంధాలు పెట్టుకుంటే మనదేశానికి ఎన్నో లాభాలు ఉన్నా, ముస్లిం ఓట్లు పోతాయనే పనికిమాలిన కారణంతో ఇప్పటిదాకా మనదేశ ప్రధానులు ఎవరూ ఇజ్రాయెల్ ని సందర్శించలేదు. ప్రధాని మోది నిన్న ఇజ్రాయెల్ చేరుకోగానే ఆయనకి లభించిన అపూర్వ స్వాగతం చూస్తే ఇన్నాళ్ళూ మనం ఒక మంచి స్నేహితుడిని దూరం పెట్టామేమో అని అనిపించకమానదు.

ఇక నిన్న నరేంద్రమోది, బెంజమిన్ నేతన్యాహూ మధ్య కుదిరిన ఒక కీలక ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ మనకి ఆర్మ్డ్ డ్రోన్స్ సప్లై చేయబోతోంది. ఇలాంటి డ్రోన్స్ అమెరికా దగ్గర ఉన్నాయి కానీ, వాళ్ళు మనకి అమ్మడానికి సిద్ధంగా లేరు. కేవలం నిఘా కోసం ఉపయోగపడే డ్రోన్స్ ఇవ్వడానికి అమెరికా అంగీకరించింది. ఇప్పుడు ఇజ్రాయెల్ నుండి మనం 400 మిలియన్ డాలర్స్ తో ఈ డ్రోన్స్ కొనుగోలు చేస్తున్నాం. 2015 లో మనం వీటి కోసం ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ తో ఒప్పందం కుదుర్చుకున్నాం.

అవి ఇప్పుడు మనకి రాబోతున్నాయి. మొన్న మన సైన్యం పాకిస్తాన్ బోర్డర్ లో ఉన్న టెర్రరిస్ట్ స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసింది కదా, అప్పుడు మనం ఎయిర్ ఫోర్స్ విమానాలని ఉపయోగించాల్సివచ్చింది. ఇది బాగా రిస్క్ తో కూడుకున్న పని. మన సైన్యానికి ప్రాణనష్టం కలిగే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ ఇస్తున్న డ్రోన్స్ తో అయితే మన సైన్యం మన బోర్డర్ లోపల ఉండే, పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేసెయ్యొచ్చు. ఉగ్రవాదమూకల్ని తుదముట్టించవచ్చు. మనకి సహజమిత్రదేశం అయిన ఇజ్రాయెల్ తో మన బంధం మరింతబలపడటానికి ప్రధాని నరేంద్రమోది చూపిస్తున్న చొరవ అభినందనీయం.

To Top

Send this to a friend