పాలు పోసి పెంచారుగా.. అనుభవించండి..


అమెరికా-బ్రిటన్ రెండూ రెండే.. దోస్తీ చేసుకొని సామ్రాజ్యకాంక్షతో రగిలిపోయాయి. అఫ్ఘనిస్తాన్, ఇరాక్ లపై మూకుమ్మడిగా దాడి చేసి అక్కడి జనాల మాన, ప్రాణాలను హరించారు. ఆ పాపం ఊరికే పోలేదు. ఐఎస్ లాంటి రాక్షసత్వ ఉగ్రమూక, బిన్ లాడెన్ లాంటి ఉగ్ర నాయకులు పురుడుపోసుకునేలా చేసింది. వారి మొదట అమెరికాపై దాడులకు పాల్పడ్డారు. లాడెన్ మృతి తర్వాత ఇప్పుడు ఆయన పోరాటాన్ని ఐసిస్ చేస్తోంది. మొన్ననే అమెరికాలో ఇద్దరు ఐసిస్ సానుభూతి పరులు పలువురిని చంపిన ఉదంతం మర్చిపోకముందే.. ఇప్పుడు మరో ఘాతుకం.. ఏకంగా ఐసిస్ ఉగ్రవాదులు బ్రిటన్ పార్లమెంటుపైనే దాడి చేశారు. నలుగురిని చంపేశారు..

మొన్నీ మధ్య యూరప్ లోని బ్రిసెల్స్ లో 32మంది మరణానికి కారణమైన ఐసిస్.. సంవత్సరం తిరగకుండానే ఏకంగా పటిష్ట బ్రిటన్ పార్లమెంటుపై దాడి చేయడం గమనార్హం. ఈ దాడులో నలుగురు మరణించడంతో దాదాపు 19మంది చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఉగ్రదాడి జరిగినప్పుడు ప్రధాని, ఎంపీలు పార్లమెంటులోనే ఉన్నారు. వారిని భద్రత సిబ్బంది సురక్షితంగా తరలించారు..

ఎవరు చేసిన పాపం వారు అనుభవించాల్సిందే.. నాడు ఇరాక్ లో ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఐసిస్ లాంటి ఉగ్రమూకల్ని సృష్టించింది అమెరికా-బ్రిటన్ లే..ఇప్పుడు బాధితులయ్యాయి. అక్కడ ప్రభుత్వాన్ని కూలదోసాక.. వారు సృష్టించిన ఐసిస్ సామ్రాజ్యవాద కాంక్షతో విస్తరించింది. ఏకంగా తమను పెంచి పోషించిన అమెరికా-బ్రిటన్ లపైనే దాడికి పాల్పడుతోంది. దీంతో తాము పాలుపోసిన పెంచిన ఐసిస్ ఇప్పుడు తమపైనే దాడులకు దిగుతుండడంతో ఈ అగ్రదేశాలు విలవిలలాడుతున్నాయి.

To Top

Send this to a friend