రాజశేఖర్‌ కోసం మరీ అతి చేస్తున్నారు


యాంగ్రీయంగ్‌ మన్‌ రాజశేఖర్‌ దాదాపు పది సంవత్సరాలకు పైగా సక్సెస్‌లు లేక నానా ఇబ్బందులు పడుతూ వస్తున్నాడు. ఒకానొక దశలో రాజశేఖర్‌ సినిమాలకు గుడ్‌ బై చెప్పాతడనే టాక్‌ కూడా వచ్చింది. అయితే రాజశేఖర్‌ నటిస్తూనే వచ్చాడు. పలు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డా కూడా రాజశేఖర్‌ జర్నీ కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఈయన జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పేరు ‘గరుడవేగ’.

ప్రస్తుతం రాజశేఖర్‌ మార్కెట్‌ పరిస్థితి అంతంత మాత్రమే. వరుస ఫ్లాప్‌ల వల్ల రాజశేఖర్‌ను పట్టించుకునే నాధుడే లేడు. ఇలాంటి సమయంలో రాజశేఖర్‌తో 10 కోట్ల లోపు బడ్జెట్‌ సినిమా చేస్తే వర్కౌట్‌ అయ్యే ఛాన్స్‌లు ఉంటాయి. కాని ‘గరుడవేగ’ చిత్రం కోసం ఏకంగా 25 కోట్లకు పైగా బడ్జెట్‌ను ఖర్చు చేస్తున్నారు. ఈ స్థాయిలో రాజశేఖర్‌పై ఏ ఉద్దేశ్యంతో దర్శకుడు ఖర్చు చేస్తున్నాడు అనేది ఎవరికి అర్థం కాని విషయం.

విదేశీ లొకేషన్స్‌, బాలీవుడ్‌ టెక్నాలజీ, సన్నీలియోన్‌ ఐటెం సాంగ్‌ ఇలా దుమ్ము దుమ్ముగా ‘గరుడ’ వేగకు ఖర్చు చేస్తున్నాడు. నిర్మాత సినిమా విడుదల తర్వాత ఏం చేస్తాడో చూడాలి. రాజశేఖర్‌ కెరీర్‌లో ఇప్పటి వరకు ఇంతటి భారీ స్థాయి బడ్జెట్‌తో సినిమా తెరకెక్కింది లేదు. ఎంత ఘన విజయం సాధించిన కూడా బడ్జెట్‌ రికవరీ దాదాపు అసాధ్యం అని ట్రేడ్‌ పండితులు అంటున్నారు. రాజశేఖర్‌ కోసం మరీ అతి ఎక్కువ చేస్తున్నారనే విమర్శలు నిర్మాత, దర్శకులపై అధికంగా వస్తున్నాయి.

To Top

Send this to a friend