ఓటుకు నోటు..మౌనమెందుకు.?


దేశాన్ని, తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఓటుకు నోటు కేసుపై ప్రతిపక్ష జగన్ ప్రతీ సభలోను విమర్శలు చేస్తూనే ఉన్నారు. గుంటూరులో నిర్వహించిన రైతు దీక్ష ముగింపు సందర్భంలో కూడా చంద్రబాబు రైతు వ్యతిరేక పాలన.. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. కేసీఆర్, మోడీ చెప్పినట్టు చేయడానికి ఓటుకు నోటు కేసు భయమే కారణమన్నారు. ఇంతలా ప్రతిపక్షాలు గొంతు చించుకుంటున్నా.. జనసేనాని పవన్ మాత్రం తన పాత మిత్రుడు చంద్రబాబు ఈ విషయంలో ఇంతవరకు ఓటుకునోటుపై గట్టిగా ప్రశ్నించిన పాపాన పోలేదు..

2014 ఎన్నికల్లో నీతిమంతులు, సమర్థులు, అవినీతి రహిత పాలన అందిస్తారనే మోడీ, చంద్రబాబుకు మద్దతిస్తున్నట్టు పవన్ చెప్పి వారి గెలుపు ఇతోదిక సాయం చేశారు.. అప్పుడు కనిపించిన నీతి, రాజనీతి ప్రస్తుతం మోడీ, బాబు లో లోపించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. చంద్రబాబు, మోడీ స్వతహాగా రాజకీయ నాయకులు.. వారు అలాంటి పనులే చేస్తారు. తమిళనాడు ఎన్నికల్లో మోడీ వ్యవహరించిన తీరు.. ఓటుకు నోటులో చంద్రబాబు అడ్డంగా దొరికిన తీరు ఇలా ఇద్దరూ అభాసుపాలయ్యారు. కానీ ఈ విషయాలపై పవన్ కఠినంగా సూటి విమర్శలు ఇప్పటివకీ చేయడం లేదు.

రాజకీయాలు ఎప్పుడూ ఒకలా ఉండవు.. 2014 ఎన్నికల్లో గెలవడానికి బాబు, మోడీ.. పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఉపయోగించుకున్నారన్నది నిర్విదాంశం.. అప్పుడు పవన్ కు రాజకీయ బలం.. బలగం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మద్దతిచ్చారు. ఇప్పుడు బలం పెంచుకుందామనుకుంటున్నా సాధ్యం పడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తమ పాత మిత్రులు చేస్తున్న అనైతిక పనులను కూడా పవన్ విమర్శించకపోవడం ఆయన రాజకీయ ఎదుగుదలకు మైనస్ గా మారింది. ప్రజలు ఎప్పుడూ ప్రతిపక్షాల వెంటే ఉంటారు. వారు తమ వాదన వినిపిస్తారని ఆశిస్తారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరుకుంటారు. కానీ క్షేత్ర సమస్యలను పట్టించుకుంటున్న పవన్.. బాబు, మోడీ పాలనను.. వారి చేష్టలను విమర్శించకపోవడం పెద్ద లోపంగా చెప్పవచ్చు.

To Top

Send this to a friend