మహేష్‌బాబుతో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ను తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల ఒక్కసారిగా టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్‌గా మారిపోయాడు. సీతమ్మ సమయంలో మహేష్‌బాబుకు శ్రీకాంత్ చాలా బాగా నచ్చాడు. దాంతో మరో సినిమా ఛాన్స్‌ను ‘బ్రహ్మోత్సవం’ రూపంలో మహేష్‌బాబు శ్రీకాంత్ అడ్డాలకు ఇవ్వడం జరిగింది. ఒక సినిమాను కథ లేకుండా తెరకెక్కించవచ్చు అనేందుకు ‘బ్రహ్మోత్సవం’ సినిమా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సినిమా నిండా స్టార్స్ ఉన్నా కూడా అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచిన బ్రహ్మోత్సవం తర్వాత శ్రీకాంత్ అడ్డాలతో సినిమా చేసేందుకు ఏ నిర్మాత కూడా సాహసం చేయడం లేదు.
శ్రీకాంత్ అడ్డాల వస్తున్నాడంటేనే హీరోలు తప్పుకునే పరిస్థితి వచ్చింది. శ్రీకాంత్ అడ్డాలను ఏ నిర్మాత నమ్మడం లేదు. కాని దిల్‌రాజు మాత్రం శ్రీకాంత్ అడ్డాలను మరోసారి నమ్మాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఒక చిన్న చిత్రంతో మాత్రమే శ్రీకాంత్ అడ్డాలకు ఛాన్స్ ఇవ్వాలని దిల్‌రాజు భావిస్తున్నాడు. ‘కొత్త బంగారు లోకం’ తరహాగా లో బడ్జెట్లో కొత్త వారితో ప్రేమ కథ చిత్రాన్ని అయితేనే దిల్‌రాజు నిర్మిస్తాను అంటూ కండీషన్ పెట్టినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల అందుకు సంబంధించి స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సంవత్సరం చివర్లోనే ఒక లో బడ్జెట్ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల ప్రారంభించే అవకాశం ఉంది. పది కోట్ల లోపు బడ్జెట్‌తో శ్రీకాంత్ అడ్డాల సినిమాను తెరకెక్కించి మరోసారి సక్సెస్ తలుపు తట్టాలని కోరుకుంటున్నాడు. మరి శ్రీకాంత్ అడ్డాలకు విజయలక్ష్మి వరిస్తుందా అనేది చూడాలి.
