మరో పెద్ద వివాదం..


అల్లు అర్జున్ హీరోగా దువ్వాడ జగన్నాథమ్ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలకు ముందూ… తర్వాత వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. సినిమాలో గాయత్రి మంత్రాన్ని హీరో అల్లు అర్జున్ చెప్పులేసుకొని పఠించడం వివాదాస్పదమైంది.

బ్రాహ్మణ పాత్ర కోసం ఎంతో కసరత్తు చేశామని దర్శకుడు హరీష్, హీరో అల్లు అర్జున్ చెప్పారు. ఇప్పుడు సినిమాలో హీరో అల్లు అర్జున్ చెప్పులేసుకొని గాయత్రి మంత్రాలు పఠిస్తూ సినిమాలో దొరికిపోయారు. ఇంత పెద్ద అపచారంపై బ్రాహ్మణ సంఘాలు, నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పటికైనా ఆ తప్పును తెలుసుకొని ఆ సీన్ కట్ చేయాలని కోరుతున్నారు..

డీజే గాయత్రి మంత్రం వివాదంపై బ్రాహ్మణ సంఘాల నాయకులు పోరుబాటకు సిద్ధమవుతున్నారు . సెన్సార్ చేసిన సభ్యులపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని డిసైడ్ అయ్యారు. సినిమాను బ్యాన్ చేయాలని బ్రాహ్మణ సంఘాలు ఆందోళనకు సిద్ధపడుతున్నాయి. అవమానించేలా ఉన్న డీజే సినిమాను ఆడనీయమని హెచ్చరిస్తున్నారు. ఇలా వివాదాస్పద కథను ఎంచుకొని డీజే యూనిట్ కోరి కష్టాలు తెచ్చుకుంటోంది. సినిమా సక్సెస్ పక్కనపెడితే రోజుకో వివాదం ఆ యూనిట్ కు నిద్ర లేకుండా చేస్తోంది.

To Top

Send this to a friend