ఫేస్ బుక్ లో లైక్ చేస్తే లక్ష రుణం

దేశంలోని మేథోశక్తికి, పేదలు, బడుగు, బలహీన వర్గాల వారికి భరోసానివ్వడానికి ‘టాటా క్యాపిటల్ సంస్థ’ సరికొత్త ప్రయోగాన్ని చేస్తూ దేశ ప్రజల అభిమానాన్ని చూరగొంటోంది. బ్యాంకుల చుట్టు రుణం కోసం చెప్పులరిగేలా తిరిగే వారు ఎందరో మనకు కనిపిస్తారు. అయినా కూడా బ్యాంకర్లు రుణాలివ్వడానికి వెనుకాముందు ఆలోచిస్తారు. ఈ పరిస్థితి వల్లే చేతుల్లో డబ్బుల్లేక.. ఐడియాలున్నా కూడా జనం, విద్యార్థులు, రైతులు తమ పనులు తాము చేసుకోలేకపోతున్నారు.

అందుకే ఈ పరిస్థితి పోగొట్టాడానికి టాటా క్యాపిటల్ ముందుకొచ్చింది. టాటా క్యాపిటల్ సంస్థ ఓ వెబ్ సైట్ రూపొందించి. ఆ వెబ్ సైట్ పేరు ‘doitwrite.in. ఇందులో ఎవరైనా రుణం అవసరమయ్యే పేదలు, విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల వారు రుణం ఎంతకావాలో పేర్కొంటూ తాము ఆ రుణంతో చేపట్టబోయే కార్యక్రమాలను నమోదు చేసుకోవాలి. ఇందులో వెబ్ సైట్ లో ‘సలాంలోన్స్’ పేరిట పేజీలను తెరిచారు. ఇందులో పోస్ట్ అయిన కథనాలను టాలా క్యాపిటల్.. ట్విట్టర్, ఫేస్ బుక్ లలో పోస్టు చేస్తోంది.

ఈ కథనాలకు స్పందించి నెటిజన్లు కనీసం వెయ్యి మంది లైక్ లు కొడితే చాలా టాటా క్యాపిటల్ సదురు దరఖాస్తు దారుడు నిజాయితీ పరుడు అని నమ్మి రుణం మంజూరు చేస్తుంది. ఇటీవలే సలామ్ లోన్స్ పేజీలో తన యథార్థగాథను బాధను వ్యక్తం చేసి ధనలక్ష్మీ బాయ్ అనే మహిళ తనకు టైలరింగ్ పెట్టుకునేందుకు లోన్ మంజూరు చేయాలని భర్త లేడని.. పిల్లలతో కష్టాలు పడుతున్నానని వివరించింది. దీనికి నెటిజన్లు స్పందించడంతో ఆమెకు రూ. లక్ష రుణం మంజూరు చేసింది టాటా క్యాపిటల్..

ఇలా సోషల్ మీడియా సాక్షిగా పేదలకు రుణాలు మంజూరు చేస్తూ టాటా క్యాపిటల్ సరికొత్త ప్రయోగం చేసింది. దీనివల్ల పేదలకు రుణంతో పాటు వారి జీవితాలు బాగుపడుతున్నాయట.. మీకు ఏదైనా సాధించాలని ఉంటే ఆ వెబ్ సైట్ లో లోన్ కోసం ప్రయత్నించండి..

To Top

Send this to a friend