ఒక్క వివాదం..  పదవి దూరం చేసింది..


టీడీపీలో వేగంగా ఎదిగిన నేత బోండా ఉమామహేశ్వర్ రావు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా.. అధికార ప్రతినిధిగా పనిచేసిన బోండా ఉమ 2014 ఎన్నికల్లో కీలకమైన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. మంచి వాగ్ధాటి ఉన్న నేతగా పేరొందారు. టీవీ చర్చల్లో.. అసెంబ్లీలో నోటితో ఇరగదీసే బోండాకు ఈ మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో ఖచ్చితంగా చోటుంటుందని ఆశించారు. కానీ ఆయనకు నిరాశే ఎదురైంది.

రాజధాని ప్రాంతంలో ఉమా లాంటి నేతలు ఉండాలని చంద్రబాబు కూడా భావించారు. టీడీపీ హైకమాండ్ కూడా ఉమా పేరును పరిశీలించింది. కానీ చివరి నిమిషంలో ఆయనకు పదవి దక్కలేదు.

బోండా ఉమకు మంత్రి పదవి దక్కకపోవడానికి ప్రధాన కారణం.. ఆయన దూకుడే.. విజయవాడ ట్రాన్స్ పోర్టు కార్యాలయంలో కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై కేశినేని నాని, బోండా ఉమ దాడి చేయడం పెద్ద మైనస్ గా మారింది.. ఈ ఘటనపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చి, చర్చకు పట్టుబట్టింది. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలోనే దీక్షకు కూర్చున్నారు. ఈ పరిణామాలన్నీ కూడా మీడియాలో సంచలనాంశాలుగా మారాయి. ఈ వివాదం అసెంబ్లీలో, మీడియాలో దుమారం రేపడంతో అప్పటివరకు మంత్రి పదవి ఇస్తాననుకున్న చంద్రబాబు వెనక్కి తగ్గి బోండా ఉమాకు మంత్రి పదవి ఇవ్వలేదని సమాచారం. మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణకు ఒక్కరోజు ముందు జరిగిన ఈ వివాదం కారణంగానే ఉమకు పదవి యోగం దక్కలేదని సమాచారం.

To Top

Send this to a friend