హీరోయిన్స్‌ దేనికైనా సిద్దపడాల్సిందే..

ఏ సినిమా పరిశ్రమ అయినా కూడా అవకాశాల కోసం హీరోయిన్స్‌ అడ్డమైన పనులు చేయాల్సి ఉంటుందని గతంలో పలువురు హీరోయిన్స్‌ చెప్పుకొచ్చారు. గత కొన్నాళ్లుగా కాస్టింగ్‌ కౌచ్‌ విషయమై టాలీవుడ్‌తో పాటు అన్ని భాష చిత్రాల పరిశ్రమల్లో భారీ స్థాయిలో చర్చ జరుగుతుంది. తాజాగా మరోసారి ఈ విషయం గురించి రాయ్‌లక్ష్మి మాట్లాడి చర్చకు తెరలేపింది. అవకాశాలు లేని హీరోయిన్స్‌ అంటే ప్రొడక్షన్‌ మేనేజర్‌ నుండి డైరెక్టర్‌ వరకు అందరికి చిన్న చూపే అని, అంతా కూడా వాడేసుకోవాలని ప్రయత్నించేవారే అంటూ చెప్పుకొచ్చింది.

అవకాశాల కోసం ప్రయత్నించే హీరోయిన్‌కు వింత అనుభవాలు ఎదురవుతాయని, ఏం చెప్పినా, ఏం చేసినా, ఏం అడిగినా కాదనకుండా చేయాలని అలా కాదంటే అవకాశాలు రావడం కష్టమే. కొన్ని సందర్బాల్లో అలా చేసినా కూడా అవకాశాలు రావనే విషయం గుర్తించాలని చెప్పుకొచ్చింది. తాజాగా ఒక తమిళ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ అమ్మడు పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.

గత కొంత కాలంగా ఈమె లారెన్స్‌తో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను కొట్టి పారేసింది. తాను జీవితంలో పెళ్లి చేసుకోను అని, అవకాశాలు వస్తే సినిమాల్లో నటిస్తాను లేదా ఏదైనా వ్యాపారం చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక కాస్టింగ్‌ కౌచ్‌ అనుభవం తనకు ఎప్పుడు ఎదురు కాలేదని, ఎందుకంటే తాను ఎప్పుడు కూడా అవకాశాల కోసం ఏ ఒక్కరిని అడగలేదు, వచ్చిన అవకాశాలను మాత్రమే చేస్తూ వెళ్తున్నాను. అందుకే తనకు అలాంటి పరిస్థితి ఎదురు కాలేదు అంటూ చెప్పుకొచ్చింది.

To Top

Send this to a friend