ఒ కన్న తల్లి ఆవేదన..

 

ఎక్కడో దేశంకాని దేశంలో మన భారతీయులకి ప్రమాదం జరిగితే మనం అందరం బాధపడతాం అది జాత్యాహంకరం కావచ్చు, ఎక్కడినుంచో వచ్చి బాగా బ్రతికేస్తున్నారన్న ఈర్ష్యకావచ్చు కాని మన దెశంలొమన రాష్ట్రంలొ మనవాళ్ళే ఒక అమాయకురాల్ని అతిదారుణంగ అత్యాచారం చేసి చంపి హ్రుదయవిదారక స్థితిలొ మ్రుతదేహన్ని వదిలి వెళ్తే హంతకులెవరో తెలిసికూడా ఎమీ చేయని చేయలేని వ్యవస్థ మనది. ఇది సినిమా కధకాదు వాస్తవం ఆ అమాయకురాలి పేరు ఆయెషా మీరా విజయవాడ ఇబ్రహింపట్నం గౌరి హస్టల్లొ వుంటూ బి.ఫార్మశి చదువుతుంది. 27డిసెంబర్2007 దారుణంగా తనజీవితం అంతమౌతుందని తెలియదు పాపం.

నిందితులని మ్రుగాలతొ పొల్చితే వాటిని అవమానించినట్లే, అత్యంత దారుణంగా మానభంగంచేచి చంపి రక్తం కారుతున్న మ్రుతదేహన్ని ఈడ్చుకెళ్ళి బాత్రూంలొ నగ్నంగాపడేసి నేనే మానభంగం చేసి చంపానని పపెర్ పై రాసిపెట్టి మరీ వెళ్ళాడాహంతకుడు. పొలిస్ హడావిడి మొదలైంది నిజానికి పొలిసులు నిజాఇతీగా వుంటే ఎవ్వడి తాటైనా తీయగలరు నాయకుల వొత్తిళ్ళకో ప్రలొభాలకొ లొంగితే ఎలాంటి స్థితినుంచైనా కళ్ళముందు సాక్ష్యాలున్నా నిందితులను తప్పించగలరు.

ఆయేషా కేసులొ అదేజరిగింది ఈ కేసులో వుంది పెద్దరాజకీయ నాయకుడి మనవడు మరి, అంతే తప్పించేశారు. విచారణ పేరుతో 1500 మందిని ప్రశ్నించారు 5 మందిని సెలెక్ట్ చేసారు లడ్డు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు కుదరకపోవటంతో వదిలేశారు. 9 నెలల తరువాత సత్యంబాబు ను అరెస్ట్ చేశారు సత్యంబాబు నిర్దోషి అని అసలు నేరస్తులను తప్పించేందుకే ఇలా చేస్తున్నారని ఆయేషా తల్లి గారైన షంషాద్ బేగం మొదటినుంచి మొత్తుకుంటూనే వున్నారు ఈ కేసులో సి.పి.అనంద్ న్యాయం చేస్తానన్నారు ఎస్.ఐ.శ్రీనివాస్ సి.ఐ.మురళి లు మీకు న్యాయం చేస్తామని చేప్పి  కేసును తారుమారు చేయడానికి ప్రయత్నించారని చెప్పారు. సైంటిస్ట్ వెంకన్న ఫొరెన్సిక్ నిపుణుడు డి.న్.ఎ రిపోర్ట్ సత్యంబాబు రిపోర్ట్ తో సరిపోఇందని తప్పు సమాచారమిచ్చి దోషులకు సహయపడ్డాడు.

సత్యంబాబు క్రిష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం అనాసాగరం గ్రామానికి చేందినవాడు పేద కుటుంబం జైల్ లొ వున్నపుడు అనారొగ్యంతో పక్షవాతం  నడవలేని స్థితి లో కాళ్ళు చేతులు గొలుసులతో కట్టేసి వున్నవాడు 4 లేక 5 మంది కాళ్ళు చేతులు కళ్ళు ఆరొగ్యంగా వున్నపోలీసులు వున్న వాహనం నుంచి తప్పించుకున్నాడని చాకచక్యంగా అర్రెస్ట్ చేశామని చెప్పరు. ఇలా చెప్పడం పొలీసులకే సాద్యం.

మహిళా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి అపార తెలివిని చూడండి హస్టల్ గేట్లువేసి సెక్యురిటీ వున్న వార్డెన్ ఆయన భార్య లొపల చాలామంది పిల్లలు వుండగా ఒ బక్క ప్రాణి లొపలకు వెళ్ళి ఆయెషాను  లాక్కొచ్చి అత్యాచారం చేసి చంపేసి లాక్కెళ్ళి బాత్రూంలొ పడేసి ఎవ్వరికి కనిపించకుండా వెళ్ళిపొయాడు అని నమ్మి జీవిత ఖైదు విందిచారు చదువు లేనివాళ్ళు అతి సామాన్యులు కూడా ఇది అసాద్యమని  చెప్పగలరు.  మరి ఆ న్యాయమూర్తికి వారి అపారమైన మేదస్సుకి  తెలివికి గొప్ప అవార్డ్ ప్రకతటిస్తే బావుంటుంది.

కొనేరు రంగారావు మనవడూ వారి బందువులు దోషులని తెలిసినా పట్టించుకోలేదు అప్పటి ప్రభుత్వం. ప్రతి చిన్న విషయాన్ని అవకాశంగా తీసుకొని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రతిపక్షం కూడా ఎమి చేయలేదు. చట్టం న్యాయం ధర్మం   బలహీనుడిపై  బలంగాను  బలవంతంగాను బలవంతులకు బానిసలుగాను పనిచేస్తున్నయ్ అనడానికి ఇంతకంటే రుజువేంకావాలి.అన్యాయంగా 8 సంవత్సరాలు శిక్ష అనుభవించి మనసిక శారీరక క్షోభననుభవించిన సత్యంబాబుకు లక్ష రూపాయలు. జీవితాంతం గొప్పగా బ్రతకొచ్చు సత్యంబాబు కుటుంబం మొత్తం, ఎలా ఖర్చు చెయాలో ఆలోచిచుకో సత్యంబాబు.

కులాల పేరుతో మనల్ని గ్రూపులుగా విడదీశే నాయకులు మన ఓటుకోసమే చుస్తారు తర్వాత మనం అదే పిచ్చిలొ ప్రతి దానిలొ గ్రూపులు ఫేస్ బుక్ వాట్సప్ ఇలా ఎన్నో కులానికిచ్చే ప్రాధాన్యత మనిషికి లేదు ముందు మనమంతా మనుషులం మనది మానవకులం ఆయేషాను ఒక ముస్లిం గానో లేక గుంటూరు జిల్లా వాసిగానో చుడొద్దు. మనమంతా ఒక్కటిగా వుంటే నిజాఇతీ వున్న పోలీసులూ వున్నారు మన శక్తి అలాంటివారికి తోడైతే నేరం చేస్తే ఎంతటి వాడినైనా బట్టలూడదీసి తంతారు. ముందు మనమంతా ఎకమైతే మనమే సమాజాన్ని బాగుచెయ్యొచ్చు కులాల మీటింగ్ పార్టీ మీటింగ్ కోసమే కాకుండా మానవత్వం కొసం కూడా  ఫేస్ బుక్ వాట్సప్ వాడదాం ఒ కన్న తల్లి ఆవేదన తీర్చటంలో మనమూ బాగమౌదాం ఇలాంటి నేరాలు ఇకపై జరగకుండా మనమే చూసుకుదాం మిత్రులారా మీరూ ఆలోచించండి మంచి సమాజం మన హక్కు. కొవ్వొత్తుల ర్యాలీలు కాదు కొవ్వుపట్టినవాడి తోలుతీశే ర్యాలీలు కావాలి 8 సంవత్సరాల జీవితం చిన్నవిషయం కాదు ఎవరు ఎలా తిరిగిస్తారు? చట్టం న్యాయం ప్రభుత్వం  సమాధానం ఎవరు చెప్తారు?

To Top

Send this to a friend