న్యాయమా .. ఉలికి పడు..


ఈ దేశం ఎటు పోతోంది.. ఏకంగా ఓ హైకోర్టు జడ్జి సుప్రీంకోర్టు న్యాయమూర్తితో పాటు దేశ అత్యున్నత న్యాయస్థానంలో జడ్జిలకు జైలు శిక్ష విధిస్తాడు. అతడి చర్యకు ఆగ్రహించి సుప్రీంకోర్టు ఆ హైకోర్టు జడ్జికి ఆరునెలల జైలు శిక్ష విధించింది. అసలు దేశంలో న్యాయ వ్యవస్త ఇంత భ్రష్టు పట్టడానికి కారణం ఎవరనే ప్రశ్న సర్వత్రా ఉదయిస్తోంది.

కోల్ కత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ పై చాలా ఆరోపణలు వచ్చాయి. దీనిపై సుప్రీంకోర్టు అభిశంసనకు ఆదేశించింది. తనపైనే విచారణ జరుపుతారా అని.. ఒక దళిత హైకోర్టు న్యాయమూర్తిని సుప్రీం అవమానించిందని జస్టిస్ కర్ణన్ సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సహా మరో ఏడుగురు న్యాయమూర్తులకు సోమవారం అయిదేళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష విధించారు.

దీనిపై మండిపడిన సుప్రీం ధర్మాసనం మంగళవారం కోర్టు ధిక్కరణకు పాల్పడి తమకే జైలు శిక్ష విధించిన జస్టిస్ కర్ణన్ కు దోషిగా తేలుస్తూ ఆరునెలల జైలు శిక్ష విధించింది. పశ్చిమబెంగాల్ డీజీపీని తక్షణం అరెస్ట్ చేయాలని ఆదేశించింది. దేశ చరిత్రలోనే ఒక హైకోర్టు జడ్జిని ఇలా అభియోగాలపై శిక్ష విధించడం తొలిసారి.. ఎలాంటి అభిశంసన విచారణ లేకుండా శిక్ష విధించిన తీరు సర్వత్రా సంచలనమైంది. న్యాయ వ్యవస్థ ఇంతలా సంచలన నిర్ణయాలు తీసుకోవడం ఇదే మొదటిసారి..

To Top

Send this to a friend