నువ్ టీడీపీకి మద్దతురాలివి.?


దగ్గుబాటి పురంధేశ్వరీ.. వైఎస్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంపీగా కీలకపాత్ర పోషించారు. అనంతరం ఏపీని విడదీసి తెలంగాణ ఏర్పాటు చేయడంతో ఇక కాంగ్రెస్ పని ఖతం అని గ్రహించి అయిష్టంగానే బీజేపీలో చేరిపోయారు. చంద్రబాబును ఆదినుంచి వ్యతిరేకించే ఈ ఎన్టీఆర్ కూతురు బీజేపీ టీడీపీతోనే నడవడంతో కోపాన్ని అంతా దిగమింగి ప్రచారంలో పాల్గొన్నారు. కానీ ఇప్పుడు బీజేపీకి, టీడీపీకి ఏపీలో దూరం పెరిగింది. అయినా కూడా బీజేపీ ఎమ్మెల్యేలు టీడీపీ మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. అధికారికంగా చూస్తే ఏపీలో బీజేపీ-టీడీపీ ప్రభుత్వమే ఉంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో టీడీపీ కేంద్ర మంత్రులు సుజనా, ఆశోక్ గజపతిలు కొనసాగుతున్నారు. అంటే టీడీపీ-బీజేపీ అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రంలో జట్టు కట్టి కొనసాగుతుందన్న మాట..

కానీ పురంధేశ్వరీకి ఇవేవీ గుర్తురావడం లేదు. తాను బీజేపీలో ఉన్న చంద్రబాబుపై మాత్రం అక్కసును దాచుకోలేకపోతోంది. అందుకే అందరూ టీడీపీకి మద్దతుగా ఉన్న కూడా పురంధేశ్వరీ ఉండలేకపోతున్నారు. మంగళవారం ఏపీలో ప్రజాస్వామ్యం కూనీ అయ్యిందని పురందేశ్వరీ మోడీకి లేఖ రాశారు. ఫిరాయింపుదారులకు ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చారని ఆ లేఖలో పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోదక చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపించారు.

కాగా ఈ లేఖపై చంద్రబాబు.. టీడీపీ నేతలు, బీజేపీ నేతలు కూడా మండిపడుతున్నారు. బీజేపీ-టీడీపీ పొత్తుపెట్టుకొని ముందుకు సాగుతున్నా.. పురంధేశ్వరీ ఇలా విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆమె పొత్తు ధర్మాన్ని ఉల్లంగిస్తున్నారని.. చంద్రబాబుపై అక్కసుతో మోడీకి లేఖలు రాస్తున్నారని మండిపడుతున్నారు.

To Top

Send this to a friend