‘జై లవకుశ’లో ఎన్టీఆర్‌ చనిపోతాడట!

ఎన్టీఆర్‌ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘జై లవకుశ’. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్న విషయం తెల్సిందే. ఆ మూడు పాత్రల్లో ఒక పాత్ర విలన్‌ అని తేలిపోయింది. ఇటీవల విడుదలైన జై టీజర్‌లో ఆ విషయాన్ని చిత్ర యూనిట్‌ సభ్యులు క్లారిటీగా చెప్పేశారు. ఇక టీజర్‌ విడుదలైనప్పటి నుండి కూడా జై పాత్ర గురించి భారీ స్థాయిలో చర్చ జరుగుతూనే ఉంది.

సినిమాపై అంచనాలు పెంచుతున్న జై పాత్ర గురించి పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఎక్కువ శాతం ఈ చిత్రంలో జై పాత్ర క్లైమాక్స్‌లో చనిపోతుంది అనేది చర్చ. మంచి వారు అయిన లవ మరియు కుశలు జైను కలిసి చంపుతారని, సోదరుడు అయినా కూడా చెడు మార్గంలో నడిచినందుకు అన్నను చంపేస్తారనే టాక్‌ వినిపిస్తుంది. ఇందులో ఎంత మేరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

జై టీజర్‌తో సినిమాపై అంచనాలు పెంచిన చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా రాశి ఖన్నా మరియు నివేదా థామస్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కళ్యాణ్‌ రామ్‌ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

To Top

Send this to a friend