విలన్ గా ఎన్టీఆర్..

ఎన్టీఆర్ కొత్త సినిమా విషయాలు ఒక్కొక్కటిగా ఆసక్తి రేపుతున్నాయి. మొదటిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న ఎన్టీఆర్ అందులో ఓ ముఖ్య విషయాన్ని రిలీవ్ చేశాడు. ఎన్టీఆర్ తాజాగా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ నిర్మాత. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జై లవకుశ అనే టైటిల్ ను ఈ సినిమాకు పెట్టారు. రాశీఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్ 21కి విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

జై లవకుశలో సినిమాలో రావణుడిని పోలి ఉండే విలన్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నాడని తాజా సమాచారం. ఇప్పటికే హీరోగా, కమెడియన్ పాత్రల్లో మెప్పించిన ఎన్టీఆర్ విలన్ పాత్రలోనూ ఎలా చేస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. కథ దృష్య్టా విలన్ పాత్ర చేస్తున్న ఎన్టీఆర్ ధైర్యాన్ని ప్రస్తుతం అందరూ మెచ్చుకుంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ఒకే సినిమాలో మూడు పాత్రలు పోషిస్తూ నటసార్వభౌముడు ఎన్టీఆర్ వారసుడు అనిపించుకుంటున్నాడు. ఎన్టీఆర్ స్వతహాగా గొప్ప నటుడు. తెలుగు హీరోల్లో అందరికంటే ఎక్కువగానే నటిస్తాడు. రాఖీ లాంటి సినిమాలు ఎన్టీఆర్ లోని నటనాకౌశలాన్ని వెలికితీశాయి.. ఇప్పుడు మరోసారి నటనాప్రధానమైన చిత్రం ఎన్టీఆర్ చేతికి వచ్చింది..

To Top

Send this to a friend