ఎన్టీఆర్‌ నోట బాబాయి మాట

నందమూరి హీరోు బాలకృష్ణ మరియు ఎన్టీఆర్‌లు కొంత కాలంగా సఖ్యతతో ఉండటం లేదనే విషయం అందరికి తెలిసిందే. వీరిద్దరి మద్య విభేదాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఆ వివాదం మాత్రం బయటకు కనపడం లేదు. బాలకృష్ణ అప్పుడప్పుడు అబ్బాయి ఎన్టీఆర్‌పై నోరు జారి వివాదం ఉందని చెప్పకనే చెబుతున్నాడు. అయితే ఎన్టీఆర్‌ మాత్రం బాలకృష్ణ విషయంలో పాజిటివ్‌గానే ఉన్నట్లుగా మరోసారి రుజువు అయ్యింది.

ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ ఒక సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. త్వరలోనే ఆ సినిమాను చేస్తాను అంటూ స్వయంగా బాలకృష్ణ కొన్నాళ్ల క్రితం ప్రకటించాడు. ఆ సినిమాకు సంబంధించిన వర్క్‌ జరుగుతుందని పేర్కొన్నాడు. అదే విషయంపై ఎన్టీఆర్‌ స్పందిస్తూ బాబాబు తాతయ కథాంశంతో సినిమా చేస్తే బ్రహ్మాండం అంటూ ఒక్క మాటలో తేల్చేశాడు.

ఎన్టీఆర్‌ స్టార్‌ మాటీవీలో ప్రసారం కాబోతున్న ‘బిగ్‌బాస్‌’ షోలో హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. ఆ ప్రెస్‌మీట్‌లోనే ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర గురించిన సినిమాకు సంబంధించి చర్చ వచ్చింది. బాలయ్య చేస్తే బ్రహ్మాండం అంటూ కామెంట్‌ చేసిన ఎన్టీఆర్‌, వర్మ చేయబోతున్న ఎన్టీఆర్‌ సినిమాపై మాత్రం స్పందించలేదు.

To Top

Send this to a friend