మహేశ్ పై ఎన్టీఆర్ హాట్ కామెంట్స్

ఎన్టీఆర్, మహేశ్ బాబు ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. ఎన్టీఆర్ పెళ్లికి మహేశ్ వచ్చాడు. అలాగే మహేశ్ ఫంక్షన్లలో కూడా ఎన్టీఆర్ సందడి చేస్తుంటాడు. ఇప్పుడు మహేశ్ తాజా సినిమా విడుదల సందర్భంగా ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు- దర్శకుడు మురగదాస్ లు కలిసి సంవత్సర కాలంగా తీర్చిదిద్దుతున్న స్పైడర్ టీజర్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న విడుదలైన సంగతి తెలిసిందే.

ఇప్పటికే సోషల్ మీడియాలో లక్షల మంది చూసిన ఈ టీజర్ పై ప్రశంసలు, అభినందనలు కురుస్తున్నాయి. మరో ఈ టీజర్ సూపర్ అంటూ చాలా మంది ప్రముఖులు కితాబిస్తున్నారు.. ఎన్టీఆర్ చాలా సందర్భాల్లో చెప్పాడు. తనకు తన తాత ఎన్టీఆర్ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఫేవరెట్ హీరో మహేశ్ బాబు అని.. మహేశ్ నటన అంటే తనకు చాలా ఇష్టమని చెప్తుంటాడు.

కానీ ఇప్పుడు ఎన్టీఆర్ చేసిన కామెంట్ హాట్ టాపిక్ అయ్యింది. బిగ్ బాస్ షోతో అలరిస్తున్న నట్టుడు ఎన్టీఆర్ అయితే స్పైడర్ టీజర్ చూసి ఆనందం ఆపుకోలేక మహేశ్ బాబుకే ఫోన్ చేశాడట. ‘మహేశ్ .. నువ్ నన్ను డామినేట్ చేస్తున్నావ్.. గడిచిన మూడు వారాలుగా తెలుగు ప్రేక్షకులు నా బిగ్ బాస్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి నీ స్పైడర్ టీజర్ గురించే చర్చించుకుంటున్నారు. ఏం ఉంది టీజర్ సూపర్ ’అంటూ మహేశ్ స్పైడర్ మూవీని ఎన్టీఆర్ పొగిడేశాడట..దీనికి నవ్వుతూ స్పందించిన మహేశ్.. ‘నా టీజర్ హవా నాలుగు ఐదు రోజులుంటుంది. కానీ నీ బిగ్ బాస్ ఇంకా నెల రోజుల పాటు తెలుగు ఇళ్లలో నానుతూనే ఉంటుంది. నీ షో సూపర్’ అంటూ ప్రశంసించాడు.

ఇలా ఇద్దరు స్టార్ హీరోలు ఎలాంటి ఇగోలు లేకుండా సరదాగా హెల్దీ కాంపిటీషన్ లో మాట్లాడుకోవడం శుభపరిణామంగా చెప్పవచ్చు..

To Top

Send this to a friend