ఎన్టీఆర్ పెద్ద మాట.. అవార్డుల పంట..


ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ (ఐఫా) అవార్డుల్లో ఈసారి బెస్ట్ యాక్టర్ గా ఎన్టీఆర్ అవార్డు దక్కించుకున్నాడు. జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ నటనకు గాను ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మైక్ అందుకొని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు బెస్ట్ యాక్టర్ గా రేసులో ఉన్న మహేశ్ బాబు(శ్రీమంతుడు), ప్రభాస్ (బాహుబలి) లు కూడా అద్భుతంగా నటించారని.. వారందరికీ ఈ నా అవార్డు అంకితమిస్తున్నానని చెప్పారు.

ఓ రకంగా ఎన్టీఆర్ ఈ విషయంలో పెద్ద మనసు చేసుకున్నారు. తనకు అవార్డు వచ్చినా కూడా ఇతర నటులు కూడా తనలాగా బాగా చేశారని వేదికపై పేర్కొనడంతో అందరి మనసులు చూరగొన్నారు. నటన అంటే అందరికీ ఒకటేనని.. పాత్రను బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేస్తామని కాబట్టి తానొక్కిడికే అవార్డు వచ్చినా ఇది అందరిది అని తెలుగు తోటి హీరోలకు గౌరవాన్ని ఇచ్చి శభాష్ అనిపించుకున్నారు..

ఐఫా అవార్డుల వివరాలు

బెస్ట్ మూవీ- జనతా గ్యారేజ్
ఉత్తమ నటి – సమంత (అఆ)
బెస్ట్ సపోర్టింగ్ రోల్ -అల్లు అర్జున్ (రుద్రమదేవి)
బెస్ట్ స్టోరీ- క్రిష్ (కంచె)
బెస్ట్ డైరెక్టర్ – కొరటాల శివ (జనతా గ్యారేజ్)
బెస్ట్ సపోర్టింగ్ రోల్ ఫిమేల్ -అనుపమ పరమేశ్వరన్ (ప్రేమమ్)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ -దేవిశ్రీ ప్రసాద్ (జనతా గ్యారేజ్)
బెస్ట్ విలన్- జగపతి బాబు (నాన్నకు ప్రేమతో)

To Top

Send this to a friend