అంచనాలు రెట్టింపు చేసిన ఎన్టీఆర్‌ లుక్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘జై లవకుశ’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. బాబీ దర్శకత్వంలో ఈ సినిమాను దాదాపు 50 కోట్ల బడ్జెట్‌తో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ తన ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే టైటిల్‌లోగోను శ్రీరామ నవమి సందర్బంగా ఆవిష్కరించడం జరిగింది. ఇక తాజాగా సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్‌ను రేపు ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌లో ఎన్టీఆర్‌ కేక పెట్టించే విధంగా ఉన్నాడు.

సినిమాపై అంచనాలు ఆకాశానికి తీసుకు వెళ్లేలా పోస్టర్స్‌ ఉన్నాయంటూ నందమూరి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. పోస్టర్స్‌ చూస్తుంటే సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అని, ఎన్టీఆర్‌ను చూస్తుంటే ఊరమాస్‌ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించడం ఖాయంగా అనిపిస్తుందని సినీ వర్గాల వారు కూడా అంటున్నారు.

ఎన్టీఆర్‌కు ఎక్కువగా మాస్‌ ఆడియన్స్‌ ఫ్యాన్స్‌గా ఉన్నారు. దాంతో వారిని టార్గెట్‌ చేసి ఎన్టీఆర్‌ ఎక్కువ సినిమాలు చేస్తాడు. ఈ సినిమా కూడా అదే విధంగా మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునే విధంగా ఉంటుందని పోస్టర్స్‌ను చూస్తుంటే అనిపిస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక్క పాత్రకు సంబంధించిన స్టిల్స్‌. మరో రెండు పాత్రల స్టిల్స్‌ ఎప్పుడు వస్తాయో చూడాలి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా రాశిఖన్నా మరియు నివేదా థామస్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సమంత గెస్ట్‌ రోల్‌లో కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు.

To Top

Send this to a friend