‘జనతాగ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం ‘జై లవకుశ’. ఈ చిత్రం భారీ స్థాయిలో అంచనాల నడుమ తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించడంతో పాటు, నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాకు నిర్మాత అవ్వడం కూడా సినిమాపై ఆసక్తిని కలుగజేస్తుంది. ఈ చిత్రాన్ని మొదటి నుండి సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేస్తామని చెబుతూ వచ్చారు.
షూటింగ్ ఆశించిన స్థాయిలో స్పీడ్‌గా జరగని కారణంగా రెండు వారాలు ఆలస్యంగా అంటే అదే సెప్టెంబర్ 21న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అదే రోజు మహేష్‌బాబు ‘స్పైడర్’ చిత్రం విడుదల ఉండటంతో పాటు, ఆ వెంటనే బాలకృష్ణ ‘పైసా వసూల్’ చిత్రం విడుదల కానుంది. ఇంత టైట్ పొజీషన్లో ఎన్టీఆర్ చిత్రం విడుదల కావడం ఫ్యాన్స్‌కు మరియు డిస్ట్రిబ్యూటర్లకు ఇష్టం లేదు.
ఈ చిత్రాన్ని ఇప్పటికే కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు మరియు త్వరలోనే అడ్వాన్స్ ఇచ్చేందుకు సిద్దం అవుతున్న డిస్ట్రిబ్యూటర్లు అంతా కూడా ఎన్టీఆర్ చిత్ర విడుదల తేదీ మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సినిమాను ముందు అనుకున్నట్లుగా సెప్టెంబర్ మొదటి వారంలోనే విడుదల చేయాలని, లేదంటే తాము సహాయ నిరాకరణ చేస్తామంటూ అల్టిమేటం జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మరి చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పుడేం చేస్తారో చూడాలి.
