లవకుమార్‌ టీజర్‌తో రానున్నాడు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘జై లవకుశ’ చిత్రంలో నటిస్తున్నాడు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను నందమూరి కళ్యాణ్‌ రామ్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌ల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుందని ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్‌ పోస్టర్‌లు మరియు తాజాగా విడుదలైన జై టీజర్‌ చెప్పకనే చెబుతున్నాయి.

జై టీజర్‌ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. అతి తక్కువ సమయంలో కోటి వ్యూస్‌ను దక్కించుకుని సౌత్‌ ఇండియా సినీ రికార్డును తిరగరాసిన జై టీజర్‌ను ఇంకా మరిచిపోకముందే మరో టీజర్‌ను వదిలేందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు సిద్దం అవుతున్నారు. ఈనెల చివర్లో లవకుమార్‌ పాత్రకు సంబంధించిన టీజర్‌ను వదలబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి సమాచారం అందుతుంది.

ఎన్టీఆర్‌ మూడు విభిన్న పాత్రల్లో నటించిన ఈ సినిమాలో హీరోయిన్స్‌గా రాశి ఖన్నా మరియు నివేదా థామస్‌లు నటిస్తున్నారు. ఒక పాత్రలో ఎన్టీఆర్‌ విలన్‌గా కనిపించబోతున్నాడు. ఆ పాత్ర ఏంటి అనేది రివీల్‌ అయ్యింది. ఇక లవకుమార్‌ మరియు కుశల్‌ కుమార్‌ పాత్రలు హీరోయిజంను కనబర్చుతారని అంచనా వేసుకోవచ్చు. లవకుమార్‌ టీజర్‌ ఏ స్థాయిలో సినిమాపై అంచనాలను పెంచుతుంది అనేది చూడాలి.

To Top

Send this to a friend