బాబాయితో వద్దులే… అబ్బాయిలు..!

ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న జై లవకుశ చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్‌ 21న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. అయితే చాలా రోజుల క్రితమే బాలకృష్ణ నటిస్తున్న ‘పైసా వసూల్‌’ చిత్రం అదే నెల 28న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. బాబాయి బాలయ్య సినిమా విడుదలకు ముందు కేవలం వారం రోజుల ముందు జై లవకుశ చిత్రాన్ని విడుదల చేస్తే బాబాయి చిత్రం కలెక్షన్స్‌పై ప్రభావం పడుతుందని, అందుకే నందమూరి హీరోలు ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌లు నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా తెలుస్తోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్‌ 21న కాకుండా వారం రోజుల ముందు అంటే సెప్టెంబర్‌ 15న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఆగస్టుకు ముందే షూటింగ్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఎన్టీఆర్‌ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లోనే కాకుండా తెలుగు ప్రేక్షకులు అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంతో దర్శకుడు బాబీ ఉన్నాడు.

జనతాగ్యారేజ్‌ వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రం తర్వాత ఎన్టీఆర్‌ చేస్తున్న ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. దాదాపు 120 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ను చేసే అవకాశం ఉంది. అందుకే ఏ సినిమాకు పోటీ రాకుండా ఒంటరిగానే ఈ సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో నిర్మాత కళ్యాణ్‌ రామ్‌ విడుదల తేదీ మార్చినట్లుగా సమాచారం అందుతుంది.

To Top

Send this to a friend