ఎన్టీఆర్ జై లవ కుశ లో కొత్త కోణం..

జనతా గ్యారేజ్ తో ఫుల్ ఫాంలోకి వచ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు జైలవ కుశ పేరుతో సినిమా తీస్తున్నాడు..ప్రస్తుతం సగటున ఏడాదికి ఒక సినిమా చేస్తూ భారీ గ్యాప్ పాటిస్తున్న ఎన్టీఆర్ ఇక అభిమానులకు చేరువ కావాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే తన కొత్త చిత్రం జై లవ కుశ టీజర్ ఈనెల 6న రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న మూవీ ‘జై లవ కుశ’. ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. . దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా.. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న జై లవ కుశ టీజర్ ను జూలై 6న సాయంత్రం 5.22 గంటలకు విడుదల చేస్తున్నట్టు ఎన్టీఆర్ స్వయంగా తన ఫేస్ బుక్ పేజీలో పేర్కొన్నారు. ఎన్టీఆర్ మూడు పాత్రల లుక్ ను ఒకే టీజర్ లో చూపించడం సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చిన జైలవ కుశ టీం.. ఎట్టకేలకు మూడు టీజర్లను ఒక్కో పాత్రకు ఒక్కోటి చొప్పున రిలీజ్ చేయాలని భావిస్తోంది. ముందుగా జూలై 6న సాయంత్రం జై పాత్ర ఎలా ఉండబోతుందనే దానిపై టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఎన్టీఆర్ ఫేస్ బుక్ ద్వారా తెలిపారు.

To Top

Send this to a friend