బిగ్ బాస్ హోస్ట్ గా ఎన్టీఆర్ అవుట్..?

మాటీవీ గతంలో నిర్వహించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో గ్రాండ్ హిట్ అయ్యింది. నాగార్జున ఈ షోను రక్తికట్టించారు. కానీ మాటీవీ చేసిన తప్పదాల వల్ల ఆ షో భ్రష్టుపట్టిపోయింది. చిరంజీవిని వ్యాఖ్యాత గా తెచ్చి మాటీవీ చేసిన తప్పుకు ఆ షో రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. దీంతో మాటీవీ మేలుకొని ఆ షోను మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మళ్లీ అలాంటి తప్పును చేయకూడదని మాటీవీ భావిస్తోంది. తమిళం లో బిగ్ బాస్ ను కమల్ హాసన్ చేసినా రాని క్రేజ్ తెలుగులో ఎన్టీఆర్ తో వచ్చింది. అందుకే ఎన్టీఆర్ కు ఎంత పారితోషికం అయినా ఇచ్చే వచ్చే సీజన్ కు కూడా హోస్ట్ గా ఒప్పించాలని భావిస్తోంది. నాగార్జునను మార్చి తప్పుచేశామని.. ఇప్పుడు బిగ్ బాస్ హోస్ట్ ప్లేసును ఎన్టీఆర్ తోనే భర్తీ చేస్తామని మాటీవీ వర్గాలు తెలిపాయట..

కొద్దిరోజులుగా వచ్చే సంవత్సరం నిర్వహించే బిగ్ బాస్ సీజన్ 2 హోస్టింగ్ ను ఎన్టీఆర్ చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. షోపై వస్తున్న విమర్శలకు జడిసి ఎన్టీఆర్ తప్పుకుంటున్నానని చెప్పినట్టు సమాచారం. కానీ ఎన్టీఆర్ నే కొనసాగించాలని.. అందుకోసం ఎంత ఇవ్వడానికైనా సిద్ధమని మాటీవీ యాజమాన్యం డిసైడ్ అయ్యిందట.. ఎన్టీఆర్ ను హోస్ట్ గా కంటిన్యూ చేయాలని కోరిందట.. దీనికి ఎన్టీఆర్ తన నిర్ణయాన్ని వాయిదా వేసినట్టు సమాచారం.

To Top

Send this to a friend