ఏ స్టార్‌ హీరోకు ఇలాంటి కష్టం రావద్దు!!

టాలీవుడ్‌లో ఏ స్టార్‌ హీరో అయినా రాజమౌళి మరియు త్రివిక్రమ్‌ల దర్శకత్వంలో నటించాలని కోరుకుంటాడు. ఈ ఇద్దరి దర్శకత్వంలో నటించాలనేది చిన్న హీరోలకు కల. వీరి దర్శకత్వంలో నటిస్తే స్టార్స్‌ అవ్వొచ్చు అనేది అందరి అభిప్రాయం. అయితే ఇప్పుడు ఎన్టీఆర్‌ పరిస్థితి పూర్తి విభిన్నంగా ఉంది. కొన్ని నెలలుగా ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ మూవీకి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్‌ మూవీ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో త్వరలోనే ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఈ సమయంలోనే జక్కన్న కూడా ఎన్టీఆర్‌తోనే సినిమా అనుకుంటున్నాడు.

ఎన్టీఆర్‌ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘జై లవకుశ’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ ఎవరి దర్శకత్వంలో నటించాలో తేల్చుకోలేక పోతున్నాడు. ఈయన కోసం రాజమౌళి మరియు త్రివిక్రమ్‌లు కథలు సిద్దం చేస్తున్నారనే టాక్‌ వినిపిస్తుంది. మరో వైపు తాజాగా ఈయన తెలుగు బిగ్‌ బాస్‌ షోకు హోస్ట్‌గా చేసేందుకు కమిట్‌ అయ్యాడు. త్వరలోనే ఆ కార్యక్రమం కూడా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

మొత్తానికి ఎన్టీఆర్‌ మూడు క్రేజీ ప్రాజెక్ట్‌లతో సతమతం అవుతున్నాడు. జై లవకుశ తర్వాత బిగ్‌బాస్‌ షోకు ఓకే చెప్పాడు. అయితే తర్వాత సినిమా ఎవరితో ఓకే చెప్తాడు అనేది చూడాలి. ఇటీవలే ఎన్టీఆర్‌ అంటే నాకు చాలా ఇష్టం అని, అతడితో ఎన్ని సినిమాలైనా చేయాలని ఉంటుందని చెప్పుకొచ్చాడు రాజమౌళి. మరో వైపు త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో తాను సినిమా చేయబోతున్నట్లుగా నిర్మాత రాధ కృష్ణ ప్రకటించాడు. ఎన్టీఆర్‌ జై లవకుశ చిత్రం దసరా కానుకగా వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత సినిమా ఈ సంవత్సరం చివర్లో ఉండే అవకాశం ఉంది.

To Top

Send this to a friend