ఎన్టీఆర్‌లో మొదలైన టెన్షన్‌!


హిందీలో సూపర్‌ సక్సెస్‌ అయిన బిగ్‌బాస్‌ షో తెలుగులో అతి త్వరలోనే ప్రారంభంకు సిద్దం అవుతుంది. ప్రస్తుతం కార్యక్రమంలో పాల్గొనబోతున్న సెలబ్రెటీలను ఎంపిక చేయడంతో పాటు, బిగ్‌ బాస్‌ హౌస్‌ను ముంబయిలో సిద్దం చేస్తున్నారు. ప్రస్తుతం ‘జై లవకుశ’ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసి ఆ వెంటనే ఎన్టీఆర్‌ ‘బిగ్‌ బాస్‌’ షోను షురూ చేయబోతున్నాడు. తెలుగు ప్రేక్షకులు ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్న ఈ షో టైం దగ్గర పడుతున్న కొద్ది ఎన్టీఆర్‌లో టెన్షన్‌ పెరిగి పోతున్నట్లుగా ఆయన సన్నిహితులు అంటున్నారు.

తమిళంలో కమల్‌ హాసన్‌ హోస్ట్‌గా ‘బిగ్‌ బాస్‌’ షో ఇప్పటికే ప్రారంభం అయ్యింది. గత ఆదివారం మొదటి ఎపిసోడ్‌ ప్రసారం అయ్యింది. అయితే ఆ షోపై తమిళనాట అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. పెద్దగా నోటెడ్‌ కాని సెలబ్రెటీలను ఎంపిక చేయడంతో కార్యక్రమంపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలగడం లేదు. నమిత తప్ప మరెవ్వరు కూడా తమిళంలో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు.

ఆ కారణంగానే కమల్‌ షోకు ప్రేక్షకాధరణ లభించడం లేదు అనే టాక్‌ వినిపిస్తుంది. ఆ విషయంలో ఎన్టీఆర్‌ చాలా జాగ్రత్త పడనున్నాడు. పారితోషికం కాస్త ఎక్కువ అయినా పర్వాలేదు సెలబ్రెటీలను మాత్రమే ఎంపిక చేయాలని స్టార్‌ మాకు ఎన్టీఆర్‌ సూచిస్తున్నాడు. అనామకులను ఎంపిక చేయడం వల్ల తెలుగు బిగ్‌ బాస్‌ షోకు కూడా ఎలాంటి గుర్తింపు రాదు అని తెలుగు ప్రముఖులు అంటున్నారు.

To Top

Send this to a friend